Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచాడు అన్న విషయం తెలియగానే ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయాయి. ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా వంటి దేశానికి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి అధ్యక్షుడిగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలోనే అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం ల మీద, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయుల మీద, మహిళల మీద ఆయన చాలా కామెంట్లు చేశారు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా గెలుపొందరని, ఇలాంటి మాటలు మాట్లాడితే అమెరికన్లే సహించరని అందరూ ఊహించారు. అమెరికన్లు కూడా చాలామంది ట్రంప్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో ఆయన తప్పకుండ ఓటమి చవిచూస్తారని అనుకున్నారు. కానీ ఆయన అందరి ఊహలను తల్లకిందులు చేస్తూ అధ్యక్షుడిగా గెలుపొందారు.

జనవరి 20న ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ… ఇకనుండి అమెరికా మనదని, మన ఉద్యోగాలు మనమే చేసుకోవాలని స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా తన మొదటి ప్రాధాన్యత అమెరికన్లకే ఇస్తానని చెప్పారు. దీనినిబట్టి చూస్తే ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి కష్టంగానే మారబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు కొత్తగా ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలనుకునే వాళ్ళు వెనకడుగు వేయొచ్చు. ముందుముందు ట్రంప్ ప్రపంచ దేశాలకు ఇంకెన్ని షాక్ లు ఇస్తాడో చూడాలి.