Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో జాతీయ స్థాయిలో కీర్తిని సంపాదించారు.బాహుబలి మొదటిభాగం చిత్రం దేశవ్యాప్తంగా మన్నలను పొందింది. ఓ తెలుగు చిత్రానికి ఈ స్థాయిలో పేరు రావడం ఇదే మొదటి సారి. బాహుబలి చిత్రం లోని మాహిష్మతి సామ్రాజ్యం సెట్టింగులు, గ్రాఫిక్స్ తో కూడుకున్నదే అయినా అది పూర్తిగా రాజమౌళి విజన్ కు నిదర్శనమని చెప్పొచ్చు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై రాజమౌళి కి పూర్తి పట్టు ఉంది.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణంలో రాజమౌళి విజన్ ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు.ఇప్పటికే సింగపూర్, జపాన్ వంటి దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి అమరావతి మాస్టర్ ప్లాన్ ని రెడీ చేసిన చంద్రబాబు అందులో మార్పులు చేర్పులు చేస్తున్నారు.

రాజధాని నిర్మాణంలో రాజమౌళి సలహాలు సూచనలు అవసరమని బాబు భావిస్తున్నారట. రాజధాని ప్రాంత అభివృధి కోసం నియమించిన సీఆర్డీఏ అధికారులను రాజమౌళితో భేటీ అయి అమరావతి గురించి చర్చించా వలసిందిగా చంద్రబాబు ఆదేశించారు. కాగా బుధవారం మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ఇతర అధికారులు రాజా మౌలిని కలిశారు. గంటకు పైగా వారు రాజమౌళితో రాజధాని అంశం గురించి చర్చించారు. ఈ నేపథ్యం లో హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణం లో మన సంస్కృతులు ప్రతిభింబించేలా నిర్మించాలనుకుంటున్నట్లు ఆ విషయం లో సలహాలు సూచనలు చేయాలనీ రాజమౌళిని నారాయణ కోరారు. ఈ విషయం లో తన వంతు సహకారాన్ని తప్పకుండా అందిస్తానని రాజమౌళి వారికీ హామీ ఇచ్చారు.