Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎంతటి రగడ జరిగిందో మనం చూశాం. ఆ గొడవల కారణంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారు. ఇక ఇదిలా ఉంటే, గత సార్వత్రిక ఎన్నికలలో వరంగల్ నుంచి ఎంపీగా గెలుపొందిన కడియం శ్రీహరి, అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల మధ్య తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ఎంపిక కావడం జరిగింది. ఆ తరువాత కడియం శ్రీహరి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తరపున పోటీచేసి విజయం సాధించారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన కడియం శ్రీహరి తన ఎంపి పదవికి రాజీనామా చేశారు. దీంతో వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక, వరంగల్ ఎంపి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ ఆ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని చూస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ఎలాగైనా వరంగల్ ఎంపీ సీటును గెలుచుకొని తిరిగి తన పట్టును నిలబెట్టుకోవాలని భావిస్తున్నది.

వరంగల్ ఎంపి పార్లమెంట్ స్థానానికి అభ్యర్ధులను వెతికే పనిలో పడింది కాంగ్రెస్. మాజీ ఎంపి జి వివేక్ ను వరంగల్ నియోజక వర్గం నుంచి పోటీకి దించాలని భావించినప్పటికీ.. వివేక్ సుముఖంగా లేదని తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనను ఆయన తిరష్కరించారు. తాను పార్టీలో కొనసాగుతానని కానీ, పోటీమాత్రం చేయనని తెలియజేశారు. కాగ, ఇందుకోసం కేంద్ర మాజీ మంత్రి ఎస్ రాజయ్యను సంప్రదిస్తున్నట్టు సమాచారం. తమకు అభ్యర్దుల కంటే గెలుపే ముఖ్యమని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది.