Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఒకప్పుడు తమిళనాడులో సినిమా, రాజకీయ రంగంలో మంచి స్నేహితులు ఎవరు అంటే టక్కున చెప్పే సమాధానం ఎంజీఆర్, కరుణానిధి. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. సినిమా రంగంలో బిజీగా ఉంటూనే.. అటు రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఇద్దరు ఉద్దండులే కాబట్టి రాజకీయాలలో కూడా సెటిల్ అయ్యారు. అయితే, కరుణానిధి రాజకీయాలలోకి రావడానికి ఎంజీఆర్ చాలా ప్రోత్సాహం ఇచ్చారు. ఎంజీఆర్ ప్రోత్సాహం కారణంగానే కరుణానిధి సిఎం కాగలిగారు. ఆ తరువాత జరిగిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు ఆంధ్రపదేశ్ లో సిని ఇండస్ట్రీలో మంచి స్నేహితులు ఎవరు అంటే పవన్- త్రివిక్రమ్ అని చెప్తాం. పవన్ కళ్యాణ్ తన దేవుడని ఇప్పటికే త్రివిక్రమ్ ప్రకటించారు. పవన్ ఎక్కడికి వెళ్ళినా కూడా రాంబంటులా త్రివిక్రమ్ ఉంటారు. త్రివిక్రమ్ దర్శకుడిగా ఇప్పటికే సెటిల్ అయ్యారు. అయితే, పవన్ మరో రెండు లేదా మూడు చిత్రాలు చేసి.. తరువాత పూర్తిగా రాజకీయ రంగం వైపుకు వెళ్తానని ఇప్పటికే చెప్పారు. జనసేన పార్టీని పూర్తిస్థాయిలో ప్రజలలోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. అయితే, సినిమా రంగంలో ఉన్న త్రివిక్రమ్ ను కూడా తన వెంట రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇప్పటికే పవన్ ఈ విషయంపై త్రివిక్రమ్ తో చర్చించినట్టు తెలుస్తున్నది. మరి పవన్ కోరితే త్రివిక్రమ్ కాదంటాడా చెప్పండి.