Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

గత కొన్ని వారాలుగా మాహారాష్ట్ర . మధ్యప్రదేశ్ రైతుల ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి వారి ఆందోళన తీవ్ర స్థాయికి చేరేలా ఉంది. ప్రస్తుత ప్రభుత్వ పాలన రైతులకు ఏ మాత్రం సహాయపడటం లేదని తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది అక్కడి ప్రభుత్వం . ఈ మధ్యనే రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టినా ఫలితం ఏ మాత్రం కనిపించకపోవడంతో ఓ రైతు లేక రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రస్తుతం రాజకీయాల్లో ఈ వార్త చర్చనీయమశంగా మారింది. ప్రతి పక్షాలు సైతం అధికార పక్ష నేతలను నిలదీస్తున్నాయి. అయితే ముఖ్యంగా చనిపోయిన ఆ రైతు లేఖలో కొన్ని డిమాండ్స్ లను నెరవేర్చమని రాశాడు.

ప్రభుత్వం రుణమాఫీ సహా తదిరత డిమాండ్లను నెరవేర్చేదాకా తన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించవద్దని అంతవరకు నా శరీరాన్ని అలానే ఉంచాలని లేఖలో రాశాడు. దీంతో ఆ రాష్ట్రంలోని చాలా రైతులకు ఈ వార్త తెలియడంతో వారు ఆందోళన చేపట్టారు. రైతు సంఘాల నిరవధిక సమ్మెతో రాష్ట్రంలోని ముంబై, పుణే వంటి ప్రధాన నగరాలకు కూరగాయలు, పండ్లు, పాల రవాణా నిలిచిపోయాయి. అంతే కాకుండా పాలను, ఉల్లిపాయలను రోడ్లపై కుమ్మరించి తీవ్ర ఆందోళన చేపడుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ రైతుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో సాభూమిపై ధనజీ 60వేల రుణం తీసుకున్నారు. పంట చేతికి అందకపోవడంతో అప్పును ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నాడు అని తోటి రైతులు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చేంత వరకు శవాన్ని కదిలించబోమని వారు గట్టిగా వాదిస్తున్నారు. మరి ఈ విషయాన్ని ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి.