Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అధికారంలో ఉన్నంత కాలం కింద స్థాయి అధికారులను తిప్పలు పెట్టె రాజకీయనాయకులకు ఒక్కోసారి ఎవరు ఊహించని విధంగా ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రస్తుతం తమిళ నాడు రాజకీయాల్లో జరుగుతున్నవి ఇటువంటివే. ఎందుకంటే పార్టీ గుర్తు కోసం ఈసీ తోనే 50 కోట్ల బేరాన్ని కుదుర్చుకోవడానికి ప్రయత్నించినా శశికళ అల్లుడు ఇప్పుడు కటకటాల పాలెయ్యట్టున్నాడు. మొదట వారు ఒప్పుకోకపోయినా బెదిరించి పార్టీ గుర్తును తమకే దక్కలే చెయ్యాలని వార్నింగ్ కూడా ట్రై చేశాడట. అయితే ఈ విషయం బయటపడటంతో ఇప్పుడు ఆ అధికారులే అతనిని విచారన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం దినకరన్ ను ఢిల్లీ పోలీసులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. వారికి ఇష్టం వచ్చినప్పుడు విచారణ చేస్తూ.. నిజాలని బయటకు లాగుతున్నారు. రీసెంట్ గా ఓ బ్రోకర్ ఆఫీసర్ తో ఈసీ కి 50 కోట్లను ఇచ్చి అన్న డీఎంకే పార్టీ యొక్క రెండాకులు గుర్తు శశికళ వర్గానికి రావాలని డీలింగ్ చేసిన సంబాషన మొత్తం ఓ వీడియో రూపంలో బయటపడింది. దీంతో మొదట ఆ వీడియోలో ఉన్నది నేను కాదని చెప్పిన దినకరన్ పోలీసులు విచారించిన తర్వాత నిజం ఒప్పుకోలేక తప్పలేదు. అయితే ఢిల్లీ పోలీసుల విచారణలో ఉన్న ఆయన సోమవారం ఎగ్మూర్ కోర్టుకి హాజరుకాలేదు. దీంతో కోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.