Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఇండియన్ క్రికెట్ టీం గురించి ప్రపంచంలో ఎవరికీ పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఒకప్పటి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి అస్సలు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రిటైర్మెంట్ తర్వాత సెహ్వాగ్ హ్యాపీ గా ఫ్యామిలీతో గడుపుతూ, అప్పుడప్పుడు తన సరదా ట్వీట్లతో అభిమానులకి ఆనందాన్ని పంచుతూనే వున్నాడు. అయితే డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి టీం ఇండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. వీరేంద్ర సెహ్వాగ్ కి మంచి బంతులు ఎలా వేసిన తన బాటింగ్ తో పిచ్చి పిచ్చిగా కొట్టేసేవాడు. ఇక ఆఫ్ స్పిన్ బౌలింగ్ అంటే ఇక అస్సలు ఉపెక్షిన్చేవాడు కాదు. దాంతో మంచి బంతులు వేస్తే ఎలాగూ కొడుతున్నాడు కాబట్టి సెహ్వాగ్ కి చెత్త బంతులు వేయడం స్టార్ట్ చేశా. ఆ ప్లాన్ సక్సెస్ అయ్యి అతను నా బౌలింగ్ లో దేశవాళీ మ్యాచ్ లు ఆడే సమయంలో చాలా సార్లు దొరికిపోయేవాడు. అతని వికెట్ తీయడానికి పెద్దగా కష్టపడాల్సిన లేదని, చెత్త బంతులు ఇస్తే సరిపోతుందని తరువాత అర్ధమైంది అని అశ్విన్ చెప్పి ఇప్పటి వరకు ఎవరికీ తెలియని సెహ్వాగ్ వీక్ నెస్ ఏంటో చెప్పేసాడు. అయితే ఈ ట్రిక్ ఏదో సెహ్వాగ్ ఆడే టైంలో చెప్పుంటే అతని అటాక్ నుంచి తప్పించుకునేవాళ్ళం కదా అని కొంత మంది బౌలర్స్ చెప్పడం విశేషం.