Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఇటీవల గ్రీన్ పీస్, ఫోర్డ్ ఫౌండేషన్ స్వచ్చంద సంస్థలు భారత చట్టాలను ఉల్లంఘిస్తున్నయంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సర్కారు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్వచ్చంద సంస్థలపై కేంద్రం చర్యలు తీసుకోవడాన్ని అగ్రరాజ్యం అమెరికా తప్పుపట్టింది. ఇక ఈ మేరకు తీవ్ర అసంతృప్తికి లోనైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తన పత్రిక ‘ఆర్గనైజర్’ సంపాదకీయంలో అమెరికా తీరుపట్ల విరుచుకుపడింది.

అలాగే ఆర్ఎస్ఎస్ తన పత్రికలో భారతీయ సార్వభౌమత్వాన్ని అమెరికా గౌరవించాలని సూచించింది. అదేవిధంగా ఇతర దేశాల నిర్ణయాలను ప్రశ్నించడం ఏమైనా అమెరికా పాలసీనా? అంటూ ఆర్ఎస్ఎస్ తీవ్రంగా మండిపడింది. ఇక గ్రీన్ పీస్, పోర్డ్ ఫౌండేషన్ లకు అమెరికా కొమ్ము కాయడం తగదని తన పత్రికలో అగ్రరాజ్యం తీరును తప్పుపట్టింది.