Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నంద్యాల ఉపఎన్నిక చంద్రబాబుకే కాదు ఆ ఆపార్టీ క్యాడర్ మొత్తానికి చిక్కులు తెచ్చిపెట్టింది.భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఖాళి అయింది. ఉపఎన్నికల్లో సీటు దక్కించుకునేందుకు అటు శిల్పా మోహన్ రెడ్డి వర్గం ఇటు భూమా కుటుంబం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు వర్గాల మధ్య నెలకొన్న వైరం చంద్రబాబుకు చిక్కులు తెచ్చి పెడుతోంది. అయినా కూడా బాబు ఒత్తిడులకు లోను కావడం లేదు.

ప్రజలు ఎవరివైపు ఉంటే వారికే సీటు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ప్రజాభిప్రయాన్ని తెలుసుకోవడం కోసం భూమా అఖిల ప్రియ వర్గం, శిల్పా మోహన్ రెడ్డి వర్గాలపై చంద్రబాబు సర్వే నిర్వహించారట. ఈ సర్వే లో ఇరువర్గాల మధ్య తేడా చాల స్వల్పంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీనితో ప్రజాభిప్రాయ సేకరణని పెంచుతూ మళ్లీ సర్వే నిర్వహించాలని చంద్రబాబు పార్టీ కేడర్ ని ఆదేశించినట్లు తెలుస్తోంది. సర్వే శాంపిల్స్ ని పెంచితే ప్రజల నాది స్పష్టంగా అర్థం అవుతుందని చంద్రబాబు అభిప్రాయం.ఎలాగైనా తన కుటుంబానికి సీటు దక్కేలా చేసి ఉపఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని అఖిల ప్రియ భావిస్తోంది. దీనితో ఆమె సొంతంగా నంద్యాల నియోజకవర్గంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.గత ఎన్నికల సమయంలో తన తండ్రి ఇచ్చిన హామీలని నెరవేర్చడానికి భూమా అఖిల ప్రియ ప్రయత్నిస్తున్నారట.