Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని అఖిలేష్ ప్రభుత్వం చూస్తున్నది. మరోవైపు అఖిలేష్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని మాయావతి చూస్తున్నది. గతంలో మాయావతి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ప్రభుత్వం చేసిన అనేక తప్పుల కారణంగా తరువాత ప్రభుత్వం ఓడిపోయింది. కాగా, ఇప్పుడు దేశంలో వెలిగిపోతున్న బీజేపి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో గెలవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ నుంచి 70 లోక్ సభ నియోజకవర్గాలలో బీజేపి విజయకేతనం ఎగరవేసింది. ఇదే దూకుడును లోక్ సభ ఎన్నికలలో కూడా ప్రదర్శించాలని బీజేపి చూస్తున్నది.

అయితే, అఖిలేష్ ప్రభుత్వంపై పెద్దగా అక్కడ వ్యతిరేఖత లేదు. మంచి నిర్ణయాలే తీసుకుంటున్నారు. అయితే, యూపి అనగానే మనకు వెనకబడిన ప్రాంతాలు, మూఢనమ్మకాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే యూపీలో ఎక్కువగా వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటికి అక్కడ గ్రామచట్టాలు అమలులో ఉన్నాయి. ఊరిపంచాయితీలో ఏది చెప్తే అక్కడ అది చట్టం. దానిని రూపుమాపడానికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోతున్నది.

ఇక, ఇదిలా ఉంటె, ఇప్పుడు అఖిలేష్ ప్రభుత్వాన్ని దాద్రి కేసు వెంటాడుతున్నది. దాద్రి గ్రామంలోని మహ్మద్ ఇఖలక్ గోమాంసం తిన్నాడని నెపంతో కొంతమంది అతని సామూహికంగా హత్య చేశారు. అప్పట్లో ఈ హత్య సంచలన సృష్టించింది. దేశంలో అసహనం పెరిగిపోతున్నదని అంటూ రాజకీయ పార్టీలు, రచయితలు, నటులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, తమకు ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను తిరిగి వెనక్కి ఇచ్చి తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.

ఉత్తర ప్రదేశ్ లో గోవధపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. గోవధ నిషేధంలో ఉన్నప్పటికీ గో మాంసం తినడం తప్పు కాదని హైకోర్ట్ పేర్కొన్నది. ఇందుకు పరిహారంగా అప్పట్లో అఖిలేష్ ప్రభుత్వం నష్టపరిహారం కింద 45 లక్షలు, నాలుగు ఇంటి స్థలాలను కూడా ఇచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. అఖిలేష్ ప్రభుత్వంలోని చీఫ్ వెటనరీ డాక్టర్.. మహ్మద్ ఇఖలక్ ఇంట్లో ఉన్నది ఆయన తిన్నది గోమాంసం కాదని, మటన్ అని సర్టిఫికేట్ ఇచ్చాడు. దీని ఆధారంగానే అప్పట్లో అఖిలేష్ ప్రభుత్వం పరిహారం చెల్లించింది.

అయితే, ఇప్పుడు తాజాగా ఓ ఆంగ్ల దినపత్రిక ఇచ్చిన సమాచారం ప్రకారం.. మహ్మద్ ఇఖలక్ తిన్నది మటన్ కాదని, గోమాంసం అని ఫోర్స్ నిక్ ల్యాబ్ లో వెల్లడయిందని పేర్కొన్నది. దీంతో దాద్రి కేసు కొత్తమలుపు తిరిగింది. గోమాంసం తిన్నా తప్పులేదని చెప్పిన కోర్ట్ ఉత్తర్వులకు లోబడి ప్రభుత్వం పరిహారం ఇచ్చిందా.. లేక, వెటర్నరి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా ప్రభుత్వం పరిహారం చెల్లించిందా. కోర్ట్ ఉత్తర్వుల ప్రకారం అయితే.. డాక్టర్ ను తొలగించాలి. ఒకవేళ డాక్టర్ సర్టిఫికెట్ ప్రకారం అయితే.. ప్రభుత్వం అభాసుపాలవుతుంది. మొత్తానికి ఎన్నికల సమయంలో అఖిలేష్ ప్రభుత్వాన్ని దాద్రి కేసు వదలబొమ్మళి నిన్నోదలా అనేటట్టుగా ఉన్నది.