Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న దిల్ వాలే చిత్రం షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోను ముంబైలోను ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటున్నది. ఇక, ఖాళీ సమయంలో సెట్స్ లో నడుస్తూ తిరిగే పనిలేకుండా రోజుకో వాహనంపై షారుక్ తిరుగుతున్నాడట. అయితే, ఈ వాహనాలను దర్శకుడు రోహిత్ శెట్టి పంపుతున్నట్టు షారుక్ ఖాన్ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. అలా రోజుకో వాహనంపై తిరుగుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టు షారుఖ్ ఖాన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కు జంటగా కాజోల్ నటిస్తున్నది.