Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న లగడపాటి రాజగోపాల్ ఆ మాట ప్రకారమే… ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవద్దని లగడపాటికి ఎంతో మంది రాజకీయ ప్రముఖులు సూచించినప్పటికీ… ఆయన తన మాటను వెనక్కితీసుకునేందుకు నిరాకరించారు. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో మంచికో…చెడుకో, అటు తెలంగాణ వాదులు… ఇటు సమైక్యవాదుల నాలుకల మీద అందరికన్నా ఎక్కువుగా లగడపాటి రాజగోపాల్ పేరు నానుతుండేది. పెప్పర్ స్ప్రే సంఘటన ద్వారా లగడపాటి రాజగోపాల్ పేరు దేశరాజకీయాల్లో కూడా మారు మ్రోగింది.

అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత లగడపాటి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారన్న ఆసక్తి ఇరు రాష్ట్ర ప్రజల్లో, రాజకీయవర్గాల్లో మళ్లీ మొదలైంది. సంచలనాలకు నెలవైన రాజగోపాల్ ప్రస్తుత రాజకీయాల్లో లేకపోవడం వెలితిగా ఉందని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అన్ని పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే, కొంతమంది రాజకీయనాయకులు లగడపాటి ఆచూకీ గురించి ఇటీవల ఆరా తీశారు. వారికందిన సమాచారం ప్రకారం… లగడపాటి ప్రస్తుతం ల్యాంకో బిజినెస్ పనుల్లో తలమునకలయ్యి ఉన్నారు. ల్యాంకో ప్రధాన కార్యాలయం ఢిల్లీకి సమీపంలోకి గుర్ గావ్ నగరంలో ఉంది. లగడపాటి రాజగోపాల్ అక్కడే నివాసముంటూ… ల్యాంకో కార్యకలాపాలను చూసుకుంటున్నారు. ల్యాంకోను మరింత విస్తరించేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వారంలో నాలుగురోజులు గుర్ గావ్ లో ఉంటూ… వారాంతానికి హైదరాబాద్ చేరుకుంటున్నారు. అలాగే, స్నేహితులు… బంధువులు ఇళ్లలో ఏ ఫంక్షన్ జరిగినా… రాజగోపాల్ ఇప్పుడు కచ్చితంగా పాల్గొంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్న ల్యాంకో భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు కూడా లగడపాటి రాజగోపాల్ ఏ మాత్రం టెన్షన్ పడలేదట. ల్యాంకో భూములను తాము చట్టబద్దంగా కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించి ప్రభుత్వం నిర్వహించిన వేలంలో కొనుకున్నామని నిరూపించే డాక్యుమెంట్స్ ను లగడపాటి టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాడేందుకు రెఢీ చేసుకున్నారు.