Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు చేసిన వ్యాఖ్యలతో ఐటి షేర్లు పేకమేడల్లా కుప్ప కూలాయి. తమ ఖాతాదారుల ఐటి షేర్ లు తగ్గనున్నాయని ప్రవీణ్ రావు వ్యాఖ్యానించారు. దీనితో మార్కెట్ ఐటి షేర్లు కుప్పకూలాయి. నిన్న భారీగా పుంజుకుని జోరు చూపించిన ఐటి షేర్లు నేడు ప్రవీణ్ రావు వ్యాఖ్యలతో భారీ గా నష్టపోయాయి.

తమ క్లైంట్స్ ఐటి వ్యయాలను చూస్తున్నారని మీడియా ముందు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా ఉన్న తమ ఖాతాదారులు బిల్లింగ్ రేట్లలో మార్పులు చేయాలని భావిస్తున్నారని అన్నారు. వారు దాదాపు 50 శాతానికి బిల్లింగ్ రెట్లని తగ్గించాలని చూస్తున్నారు.. ఇది 150 బిలియన్ డాలర్ల వ్యాపారంపై ప్రభావం చూపుతుంది అని ప్రవీణ్ రావు మీడియా ముందు వ్యాఖ్యానించారు. దీనితో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా భయందోళనలకు గురయ్యారు. ఆయన వ్యాఖ్యలతో అన్నీ ఐటి షేర్ లలో భారీగా ఒత్తిడి కనిపించింది. దీనితో ఇన్ఫోసిస్ తో సహా విప్రో, టిసిఎస్, హెచ్ సీఎల్ మరియు ఇతర టెక్ దిగ్గజాల షేర్ లన్ని కుప్ప కూలిపోయాయి.అలంటి దేమి లేదని ఇన్ఫోసిస్ యాజమాన్యం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీనిపై ప్రవీణ్ రావు కూడా స్పదించారు. బిల్లింగ్ రేట్లు తగ్గించాలని భావిస్తున్నట్లు తాను చెప్పలేదని తన వ్యాఖ్యలని తప్పుగా అర్థం చేసున్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.