Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మెగా ట్యాగ్ లైన్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ కి కెరీర్ పరంగా పెద్దగా కమర్షియల్ విజయాలు మాత్రం దక్కడం లేదు. కంచె లాంటి భిన్నమైన సినిమాతో ప్రశంశలు అందుకున్నా కూడా వరుణ్ కు ఆ తరువాత వరుసగా పరాజయాలు దక్కాయి. లేటెస్ట్ గా ఎన్నో హోప్స్ పెట్టుకున్న మిస్టర్ కూడా దెబ్బ కొట్టాడు. ఇక మంచి కాఫీ లాంటి సినిమా అంటూ కొత్తగా ప్రేక్షకులకు పలకరించే శేఖర్ కమ్ముల కొంత గ్యాప్ తరువాత వరుణ్ తో ఫిదా సినిమా చేస్తున్నాడు. సినిమా మొదలై చాలా రోజులు అవుతున్నా కూడా ఇంకా విడుదల విషయంలో క్లారిటీ ఇవ్వలేదు .. దిల్ రాజు బ్యానర్ లో వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. మిక్కీ జె మేయర్ సంగీతం, సాయి పల్లవి హీరోయిన్ లాంటి అదనపు హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కాబట్టి వరుణ్ కూడా కమర్షియల్ బ్రేక్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని జులై 3 న విడుదల చేయాలనీ నిర్మాత ప్లాన్ చేసాడు .. మరి ఈ సినిమాతో అయినా వరుణ్ తేజ్ .. ప్రేక్షకులను ఫిదా చేస్తాడో లేదో చూడాలి ?