Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆధునిక ప్ర‌పంచంలో అంతా మాయ‌! సాంకేతిక‌త కొత్త పుంత‌లు తొక్కుతున్న కొద్దీ సుఖాలు పెరిగిపోతున్నాయి. సోమ‌రిపోతుల్ని త‌యారు చేస్తోంది ఈ ప్ర‌పంచం. సోమ‌రిత‌నంలో ప‌రాకాష్ట అల‌వాట‌వుతోంది. ఏదైతేనేం.. టెక్నాల‌జీ వ‌ల్ల కొంత మేలు.. అంత‌కుమించిన కీడు ఉంద‌ని అంద‌రికీ అర్థ‌మైంది. అయితే ఇదంతా ఎందుకంటే.. మునుముందు మ‌నం సినిమా చూసే తీరు మారిపోబోతోంది. ఇంకా న‌ల్లులు కుట్టే పాత కుర్చీల‌కు అంకిత‌మై, గోక్కుంటూ సినిమా చూడాల్సిన ప‌నేలేదు. ఇక‌ముందు హైక్లాస్ థియేట‌ర్లు వ‌చ్చేస్తున్నాయి. ఇప్ప‌టికే మెజారిటీ పార్ట్ న‌గ‌రాల‌న్నీ మ‌ల్టీప్లెక్స్ క‌ల్చ‌ర్‌లో మునిగిపోయాయ్‌. మునుముందు దీన్ని మించిన ల‌గ్జ‌రీ ఫెసిలిటీ థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. ఇప్ప‌టికే `శివాజీ` సినిమాలో ర‌న్నింగ్ కార్ స్టాండింగ్‌లో పెట్టి అందులో కూచుని.. థియేట‌ర్ల‌లో సినిమా చూసే క‌ల్చ‌ర్ ఉంది. కాస్ట్‌లీ సిటీల్లోనే ఇది అందుబాటులో ఉంది. మ‌న దేశంలో మ‌రీ అంత పాపుల‌ర్ కాదు. రిచెస్ట్ దేశాల‌కే ప‌రిమిత‌మైంది. మ‌న దేశంలో ఇంకా రావాల్సి ఉంది.

అయితే ఈ ర‌క‌మైన ముగ్గులోకి మ‌న తెలుగు ప్ర‌జ‌ల్ని దించేందుకు రిల‌య‌న్స్ కంక‌ణం క‌ట్టుకుంది. ఇక‌ముందు ప‌డుకుని సినిమా చూసే థియేట‌ర్ల‌ను బ‌రిలోకి తెస్తోంది. ముంబైలో ఇప్ప‌టికే అందుబాటులో ఉన్నాయి. మన ఇండియా లోనే అతిపెద్ద సినిమా థియేటర్ జూన్ 26 న వడోదర (గుజరాత్) లో రిలయన్స్ మూవీ మాల్ ప్రారంభం కానుంది. టికెట్ 800 రూపాయలు. ఇందులో పడుకొని సినిమా చూడవచ్చు. గుజ‌రాత్ వ‌ర‌కూ వ‌చ్చింది అంటే హైద‌రాబాద్ స‌హా ఏపీ తెలంగాణ‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కు ఈ క‌ల్చ‌ర్ కాస్త ఆల‌స్యంగా అయినా అడుగుపెడుతుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే ఇది బ‌డుగు జీవుల‌కు కాకుండా హై ఎండ్ రిచ్ పీపుల్‌కే ఆరంభం అందుబాటులో ఉంటుంది.