Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రిలయన్స్ గ్రూపు చైర్మన్  అనిల్ ధీరూబాయ్‌  అంబానీ సంచలన నిర్ణయం  తీసుకున్నారు. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ నుంచి ఎలాంటి వేతనం  తీసుకోకూడదని నిర్ణయించుకన్నారు. అప్పల ఊబిలో కూరుకుపోయి కష్టాల్లో ఉన్న  ఆర్‌కామ్‌ను అదుకునేందుకు  ఈ చర్యకు దిగారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి జీతం లేదా కమిషన్‌ గానీ స్వీకరించకూడదని  అనిల్‌ అంబానీ  నిర్ణయించుకున్నారని సంస్థ  ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వ్యూహాత్మక పరివర్తన కార్యక్రమంలో సంస్థ ప్రమోటర్ల బాధ్యతతో పాటు, ఛైర్మన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని  సంస్థ పేర్కొంది.  ఈ క్రమంలో ఆర్కాం మేనేజ్మెంట్ కూడా ముందుకు సాగుతుందని తెలిపింది.  సంస్థ బోర్డు సభ్యులు కూడా 21 రోజుల వేతనం  వదులుకోవాలని  నిర్ణయించారు. డిశెంబర్‌ 2017 వరకు ఈ నిర్ణయం  అమల్లో  ఉంటుందని  రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌  వెల్లడించింది.