Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

(సెప్టెంబర్ 30 న మంగళవారం నాడు) అమెరికా సంయుక్త రాష్ట్రాలలో విసృత పర్యటన చేస్తున్న BJPజాతీయనాయకులు పేరాల చంద్రశేఖర్ ( శేఖర్జీ )గారి గౌరవార్దం అఖిల భారతీయ విద్యార్ది పరిషత్ పూర్వ విద్యార్దులు మరియు ప్రవాస భారతీయ జనతా పార్టీ మిత్రబృందం,ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు సమావేశం న్యూ జెర్సీ లోని ‘కోరియాండర్’ రెస్టారెంటు లో ఘనంగా జరిగింది .దాదాపు 110 మంది ప్రవాస తెలుగువారు హాజరైన ఈ సమావేశానికి ప్రవాస భారతీయ జనతా పార్టీమిత్రబృందం, న్యూ జెర్సీ తెలుగు వారు, ఉత్తర , దక్షిణ రాష్ట్రాల వారు సభికులందరికీ స్వాగతంతెలుపుతూ ప్రారంభించారు.ప్రవాస విద్యార్ది పరిషత్ పూర్వ ఉస్మానియా యూనివర్సిటి నాయకులు మరియు న్యూ జెర్సీ ఏరియా కో- ఆర్డినేషన్ ఇన్ ఛార్జ్ జంబుల విలాస్ రెడ్డి ప్రసంగిస్తూ గతం లో తాను శేఖర్జీ తో పనిచేసిన అనుభవాలను సభతో పంచుకొన్నారు .శేఖర్జి నాయకత్వం లో ఎన్నో ఉద్యమాలలో,ఆందోళనల్లో పాల్గొనడం వారితో కలిసి స్వదేశీ ఉద్యమం,అల్ కభీర్,కాశ్మీర్ ఉద్యమం ,అయోధ్య ఉద్యమం లాంటి ఎన్నో ఉద్యమాలలో పాల్గొనే అవకాశం తనకు కలిగిందని అన్నారు. సమర్ద నాయకత్వం లక్షణాలను విద్యార్ది దశ లో వారి నుంచి నేర్చుకొన్నాను అన్నారు . పేరాల చంద్రశేఖర్గారిని, శ్రీకాంత్ రెడ్డి మరియు శ్రీనివాస్ గార్లు వేదిక పైకి ఆహ్వానించి వారిని సభకు పరిచయంచేసారు .చంద్రశేఖర్ గారు దాదాపు 30 సంవత్సరాలు పైగా పూర్తి సమయం కార్యకర్తగా వివిధ సంఘ్ పరివార్ అనుభంద సంస్థలు రాష్ట్రీయ సేవక్ సంఘ్ లోనూ మరియు విద్యార్ది పరిషత్ లోనూ,అదే విదంగా వారు భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు గాను , జాతీయ భద్రతా సంఘం యొక్క కన్వీనర్ గాను మరియు ఈశాన్య రాష్ట్రాల సమన్వయకర్తగా శేఖర్జి చేసిన సేవల గురించి తెలిపారు.
అదే విధంగా , సౌమిత్ర గోఖలే – విశ్వ విభాగసం యోజక్ (ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ అఫ్ హిందూ స్వయం సేవక్ సంఘ్ ) గారు మాట్లడుతూవిద్యార్ధిపరిషత్ ఎల్లవేళలా ఉన్నతసమాజం కోసం మరియు క్రమశిక్షణ కల్గిన విద్యార్థులుగా ఉండడం జరుగుతుంది . విద్యార్ధి దశ తర్వాత కూడా రేపటి సమాజానికి తమవంతు సహాయం చేయాలన్నతపననిస్వాగతిస్తున్నాను అని అన్నారు .అదేవిదంగా , చంద్రకాంత్ పటేల్ – (ఓవర్సీస్ ఫ్రెండ్ అఫ్ బి. జే. పీ అద్యక్షుడు ), మాట్లడుతూ ,అమెరికాలో పూర్వ అఖిల భారతీయ విద్యార్దిపరిషత్ – జంబుల విలాస్రెడ్డి ఆద్వర్యంలో పేరాల చంద్రశేఖర్ గారికి ఘనసన్మానం చేయడంఅభినందనీయం.
టీవీ 5 మీడియా ముఖ్యఅధికార ప్రతినిది – శ్రీధర్ చిల్లర గారు పాల్గొని, శేఖర్జీ గారు మంచి సమాజం కోసం,ప్రజల కోసం తమ పూర్తి సమయాన్నికేటాయించడాన్ని అభినందిచారు.
ఆ తరువాత ముఖ్య అతిధి BJP జాతీయ నాయకులు శ్రీ పేరాల చంద్రశేఖర్రావు మాట్లాడుతూ న్యూ జెర్సీ రాష్ట్రం లో ఇంతమంది తెలుగువారిని ఈ వేదిక ద్వారా కలువగలగడం తనకు ఎంతో ఆనందంగా ఉంది అన్నారు . దేశభద్రత,మన దేశ ఈశాన్య రాష్ట్రాల లో సరిహద్దులలో రక్షణ సవాళ్లు భారత ప్రభుత్వం ఎదుర్కొన్న తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. మన ప్రదాన మంత్రి మోడీజి వందరోజులపాలన గమనించినట్లయితే మొదట ప్రమాణస్వీకారం రోజే సార్క్దేశాల ప్రతినిధులను ఆహ్వానించి పొరుగుదేశాలతో స్నేహ సంబందాలకు మోడిజి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రపంచవ్యాప్తముగా భారత్ శాంతి కాముక దేశమని చాటారని అన్నారు .మనతీరప్రాంతం ,సరిహద్దులను భద్రతచేసుకోవడం మరియు పొరుగు దేశాల అవసరాలు మేరకు పరస్పరసహకారం వల్ల భారతదేశం అంతర్గతంగా అభివృద్ధిచెందుతుందని అన్నారు. నేపాల్, భూటాన్ ,బంగ్లాదేశ్,శ్రీలంక ,మయన్మార్,జపాన్ దేశాలతో స్నేహ సంభందాలు మళ్లి మెరుగుపడే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి అన్నారు . మొదట అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా భారత్దేశం కన్నాపాలసీమేటర్స్లో పాకిస్తాన్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదని మరియు మిత్రదేశంగా భావించేదని కాని మారిన పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడు భారత్దేశం వైపు చూస్తూఎన్నోపాలసీలు ఉభయ దేశాలకు అనుగుణంగామార్పులు చేర్పులు చేస్తున్నదనిఅన్నారు. అంతర్జాతీయంగా దౌత్యపరంగా కూడా భారత్కు మద్దతు తెలిపే దేశాలు ఎక్కువ కానున్నాయని అన్నారు. మోడీజి అమెరికా పర్యటన జయప్రదమై ప్రపంచవ్యాప్తముగా భారత్లో పెట్టుబడులకు మరియు వాణిజ్య ఒప్పందాలకు నూతన ద్వారాలు తెరిసిందని అదేవిధంగా ఇరుదేశాల మద్య దౌత్య సంభందాలు ఎంతో మెరుగుపడనున్నాయని అన్నారు.రాబోయే రోజుల్లో ప్రవాస భారతీయులు మరింతగా అమెరికన్ పాలసీ సలహాదారులను ఆకట్టుకొని ,గొప్పగా ప్రభావితంచేసి ఇండోఅమెరికన్ ప్రజాస్వామ్యదేశాలమధ్య వారధిలా పనిచేయాల్సి వుందని తెలిపారు .తరతరాలుగా ప్రపంచానికి భారత్దేశం ఆధ్యాత్మిక గురువుగా ఆదర్శమై వెలుగుతున్నది .మోడిజి ప్రభుత్వం ఆధ్యాత్మికక్షేత్రాలనిర్వహణలో ,శిక్షణలో ,సౌకర్యాలలో పెనుమార్పులు తీసుకొచ్చి భారతీయ ఆధ్యాత్మిక సంపద ప్రపంచానికి అందేలా చేయడం జరుగుతుందని అన్నారు .రాబొయే రోజులలోమోడీజి ప్రభుత్వం ఎన్నోఅభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించనున్నది అని తెలిపారు. ఈ సందర్బంగా పేరాల చంద్రశేఖర్ గారి ని “అబ్దుల్కలాంలీడ్ఇండియా – 2020” అద్యక్షుడు హరిఇప్పనపల్లి మరియు ఉపాద్యక్షుడు శ్రినివాస్ గానగొని శాలువలతోమరియు మేమొంటూ ఇచ్చి సత్కరించడం జరిగింది మరియు వివిధప్రవాస తెలుగుసంఘాల ప్రతినిధులు ఘనంగాసత్కరించారు.