Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అభిమానం వెర్రిత‌ల‌లు వేయ‌డంపై ప‌లు భ‌యాన‌క ఎగ్జాంపుల్స్ చూశాం. ఒక హీరోని ఇంకో హీరో అభిమానులు తిట్టేయ‌డం.. గేలి చేయ‌డం.. గొడ‌వ చేయ‌డం వంటి ఇన్సిడెంట్స్ ఇటీవ‌ల ప్ర‌త్య‌క్షంగా సాక్షాత్క‌రించాయి. ఫ్యాన్స్‌- యాంటీ ఫ్యాన్స్ ర‌చ్చ గురించి సామాజిక మాధ్య‌మాల్లో విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది. మా హీరో – మీ హీరో అంటూ కొట్టుకోవ‌డంపైనా బోలెడంత ర‌చ్చ సాగింది. అయితే ఈ సీను అందుకు పూర్తి రివ‌ర్సులో ఉండ‌డం టాలీవుడ్‌లో చ‌ర్చ‌కొచ్చింది. మ‌హేష్ `స్పైడ‌ర్‌`ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ఓ రేంజులో పొగిడేయ‌డం చూస్తుంటే అభిమానం కొత్త పుంత‌లు తొక్కుతోంది అన‌కుండా ఉండ‌లేం.

మోడ్ర‌న్ డేస్‌లో అన్నీ మారిపోతున్నాయ్‌. అభిమానం రూపు మారింది. రంగు మారింది. అభిమానుల్లో ప‌రిణ‌తి పెరిగింది. విద్య‌తో కూడిన సంస్కారం పెరిగింది. అందుకు ఇటీవ‌ల ఎన్నో ఎగ్జాంపుల్స్ క‌నిపిస్తున్నాయ్‌. ఒక హీరో సినిమాని ఇంకో హీరో అభిమాని పొగిడేస్తుండ‌డం .. ఆద‌రిస్తుండ‌డం.. వంటి కొత్త ప‌రిణామం క‌నిపిస్తోంది. ఇటీవ‌లి కాలంలో తెలుగులో బంప‌ర్ హిట్లు కొట్టిన‌వ‌న్నీ అంద‌రు హీరోల‌ అభిమానులు ఆద‌రించ‌డం వ‌ల్ల‌నేన‌ని చెప్పొచ్చు. ఒక‌ప్ప‌టితో పోలిస్తే అభిమానులు .. మా హీరో.. మీ హీరో అంటూ కొట్టుకోవ‌డం లేదు. పోటీ హీరో సినిమా ఎలా ఉంది? అన్న క్యూరియాసిటీ క‌నిపిస్తోంది. లేటెస్టుగా మ‌హేష్ `స్పైడ‌ర్‌` టీజ‌ర్‌కి ప‌వ‌న్ ఫ్యాన్స్ నుంచి చ‌క్క‌ని ప్ర‌శంసలు వ‌స్తున్నాయి. పీకే వీరాభిమానులు సైతం టీజ‌ర్ బావుందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తుండ‌డం విశేషం. స్పైడ‌ర్ టీజ‌ర్ రిలీజైన గంట‌లోనే 10ల‌క్ష‌ల వ్యూస్ .. 50,000 లైక్‌లు సాధించింది. ఇప్ప‌టికే 40 ల‌క్ష‌ల వ్యూస్‌ని అధిగ‌మించింది. టీజ‌ర్‌ ఈ స్థాయి విజ‌యం సాధించ‌డానికి కార‌ణం మ‌హేష్ అభిమానుల‌తో పాటు ప‌వ‌న్ అభిమానులు అంతే క్యూరియ‌స్‌గా ఎదురు చూడ‌డం వ‌ల్ల‌నే. ఫ్యాన్సే క‌దా హీరోల బ‌లం. ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ అనుకునేవాళ్లు పాజిటివ్‌గా మారిపోవ‌డంతో అది సినిమాల బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల వ‌ద్ద వ‌ర్క‌వుట‌వుతోంది. ఇది మంచి ప‌రిణామ‌మే.

ఈ కొత్త ప‌రిణామం .. మ‌రికొంద‌రు వీర‌లెవ‌లు అభిమానుల‌కు కొన్ని పాఠాలు నేర్పిస్తోంది. ఇటీవ‌లి కాలంలో సామాజిక మాధ్య‌మాల్లో కొంద‌రు అగ్ర హీరోల అభిమానులు నువ్వా? నేనా? అంటూ కొట్టుకోవ‌డం విస్త్ర‌తంగా చ‌ర్చ‌కొచ్చింది. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ వీరాభిమానులు – ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమానులు మ‌ధ్య కొట్లాట‌పై వాడి వేడి చ‌ర్చ సాగింది. ప‌వన్ టీజ‌ర్ రాగానే బ‌న్ని అభిమానులు సామాజిక మాధ్య‌మాల్లో డిస్‌లైక్‌లు కొట్ట‌డం.. బ‌న్ని టీజ‌ర్ రాగానే ప‌వ‌న్ అభిమానులు డిజ్‌లైక్స్ కొట్ట‌డం వంటి చీవాట్లు తినే ప‌నులు చేశారు. దానిపై అప్ప‌ట్లో క్రిటిక్స్ ఓ రేంజులో విమ‌ర్శించారు. అభిమానం మ‌రీ ఇలా వెర్రిత‌ల‌లు వేయ‌కూడ‌దు అంటూ క్లాస్ తీస్కున్నారు. అంత‌కంటే ముందే న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానుల‌కు .. ఎన్టీఆర్ అభిమానుల‌కు మ‌ధ్య క్లాషెస్‌పైనా అంతే సీరియ‌స్ గా చ‌ర్చించుకున్నారు. ఆయ‌న ఫంక్ష‌న్‌లో ఈయ‌న అభిమానులు.. ఈయ‌న ఫంక్ష‌న్‌లో ఆయ‌న అభిమానులు వీరంగం వేయ‌డం టూ బ్యాడ్ అంటూ మాట్లాడుకున్నారు. ఊరూ వాడా ఈ ఫ్యాన్స్ క్లాషెస్ గురించి ముచ్చ‌ట్లు సాగాయి.

అయితే రొటీన్‌కి భిన్నంగా.. ప్ర‌స్తుతం ప‌వ‌న్ అభిమానులు, మ‌హేష్ అభిమానులు పాటిస్తున్న సంయ‌మ‌నం, ప‌రిణ‌తి అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తోంది. ఇత‌ర హీరోల అభిమానులు సైతం ఇలానే హుందాగా ఉండొచ్చు క‌దా! డీసెన్సీ మెయింటెయిన్ చేయొచ్చు క‌దా!! అలా ఉండ‌కుండా లేనిపోని ర‌చ్చ‌తో త‌మ అభిమాన హీరోకి బ్యాడ్ నేమ్ తేవ‌డం ఎంత‌వ‌ర‌కూ క‌రెక్ట్ అంటూ ప‌లువురు సూచిస్తున్నారు. ఒక హీరో సినిమాని హిట్ చేసేందుకు వేరొక హీరో అభిమానులు కృషి చేయాలి. అందువ‌ల్ల మ‌న తెలుగువారి యునిటీ బ‌య‌టి ప్ర‌పంచానికి ఆవిష్కృత‌మ‌వుతుంది. అంద‌రు ఫ్యాన్స్ చేతులు క‌లిపారు కాబ‌ట్టే బాహుబ‌లి ఖండాంత‌రాల్లో అంత పెద్ద విజ‌యం సాధించింది. ఇప్పుడు అంత‌కుమించిన సినిమాలు మ‌న హీరోల నుంచి రావాలంటే అభిమానులంతా చేతులు క‌ల‌పాల్సిన త‌రుణం వ‌చ్చింది. అందుకు మీరంతా సిద్ధ‌మేనా? అన్నిటికీ కాల‌మే స‌మాధానం చెబుతుంది అని వ‌దిలేయ‌లేని సంద‌ర్భ‌మిది.