Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అప్పుడప్పుడు కొందరు తీసుకునే నిర్ణయాలు షాక్ కి గురి చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వారు చేస్తున్న పని ఎంత గొప్పది అయినా , ఎంత డబ్బున్న ఆనందాన్ని పొందలేమని ఎవరు ఊహించని విధంగా ఒక వినూత్నమైన దారిని ఎంచుకుంటారు. ఇదే తరహాలో ఓ విద్యార్థి నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. గుజరాత్ కి చెందిన కళ్యాణ్ రత్నవిజయ్ సూరి మహరాజ్ అనే జైన్ మంక్ వల్ల ప్రభావితుడై సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నాడు. సాధరణంగా జీవితం పై విరక్తి చెందిన వారు ఈ దారిని ఎంచుకుంటారు కానీ కళ్యాణ్ కి ఏ విధమైన కష్టాలు లేవు. పైగా మంచిగా చదువుకునే కుర్రాడు రీసెంట్ గా రాసిన ఇంటర్ ఎగ్జామ్స్ లో 99.99 శాతం మార్కులతో పాస్ అయ్యాడు.

17ఏళ్ల ఈ నవ యువకుడు గుజరాత్ విద్యాబోర్ట్ నిర్వహించిన పరీక్షల్లో టాపర్ గా నిలిచాడు. అయితే ఏ యువకుడైన కాలేజ్ లైఫ్ ను చాలా ఎంజాయ్ చేయాలనుకుంటారు కానీ ఈ బుద్దిమంతుడు మాత్రం అందులో ఏ మాత్రం జీవితం లేదని సన్యాసిగా మారడంలోనే అసలైన జీవితం ఉందని చెబుతున్నాడు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కారెంటు ఉత్పత్తి చేసే ప్రక్రియలో అనేక జల జీవులు చనిపోతాయని అందుకు కరెంట్ వాడకాన్ని కూడా చాల వరకు తగ్గించారట ఆ యువకుని కుటుంబ సభ్యులు. ఆ యువకుడు ఇలా మారడానికి వారి కుటుంబానికి అమితంగా భక్తి ఉండటమే అని తెలుస్తోంది.