Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్ర‌భాస్ పారితోషికం రేంజ్ ఎంత‌? బాహుబ‌లి -1కి 25 కోట్లు అన్నారు. బాహుబ‌లి-2 కోసం ఏకంగా 75 కోట్లు ముట్టాయ‌ని చెప్పుకున్నారు. ఏరియా రిలీజ్ బిజినెస్ క‌లిపి అంత తీసుకున్నాడ‌ని అన్నారు. బాహుబ‌లి రెండు భాగాలు క‌లిపి 100 కోట్లు అన్నారు. అయితే ఇప్పుడు `సాహో` సినిమాకి బాహుబ‌లి-2 స్ట్రాట‌జీనే అనుస‌రిస్తున్నాడ‌న్న స‌మాచారం ఉంది. కొన్ని ఏరియాల రిలీజ్‌ త‌న సొంతం చేసుకుంటాడు. అయితే ఇదంతా స‌రే కానీ.. ఆ పుకారు ఎలా వ‌చ్చిందో కానీ ప్ర‌భాస్ – స‌ల్మాన్ క‌ల‌యిక‌లోని రోహిత్ శెట్టి తెర‌కెక్కించే సినిమాకి ఏకంగా 80 కోట్లు అందుకుంటున్నాడ‌ని ఓ కొత్త ప్ర‌చారం సాగింది. అస‌లు ఇంత‌కీ ఈ పుకారు ఎలా పుట్టింది? ఇందులో వాస్త‌వం ఎంత‌?

అస‌లు `బాహుబలి సిరీస్‌కి ముందు ప్ర‌భాస్ పారితోషికం ఎంత‌? ఆ సిరీస్ రికార్డ్ హిట్ త‌ర్వాత ప్ర‌భాస్ పారితోషికం ఎంత‌? ప్ర‌స్తుతం ప్ర‌చారంలోకి వ‌చ్చిన పారితోషికం ఎంత‌? ఈ మూడు లెక్క‌లు తేలితే.. షాక్ తినిపోతారు. బాహుబ‌లుడిగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్ర‌భాస్‌ ప్ర‌స్తుతం 80 కోట్ల మేర పారితోషికం డిమాండ్ చేస్తున్నాడంటూ ఒక‌టే ప్ర‌చారం సాగుతోంది. ఆ మేర‌కు ఓ ఆంగ్ల ప‌త్రిక క‌థ‌నం హైలైట్ అయ్యింది. ప్ర‌భాస్ – స‌ల్మాన్ – రోహిత్ శెట్టి సినిమాకి ఇంత డిమాండ్ చేస్తే పెండింగులో ఉందంటూ స‌ద‌రు క‌థ‌నం రాసుకొచ్చారు. అయితే నిజానికి ఈ పుకారు పుట్టించింది ముంబైలోని ప్ర‌భాస్ పీఆర్ టీమ్ అయి ఉంటుందా? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. అక్కడ డార్లింగ్ స‌రైన టీమ్‌ని ర‌న్ చేస్తున్నాడ‌ని బాలీవుడ్ లోనూ త‌న ఇమేజ్ పెంచుకునే ఆలోచ‌న‌లో ఇదంతా చేస్తున్నాడ‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఇక‌పోతే ప్ర‌భాస్ వాస్త‌వానికి బాహుబ‌లి సిరీస్ ముందు ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉండేవాడ‌ని జ‌క్క‌న్నే స్వ‌యంగా చెప్పాడు. అంటే అప్ప‌ట్లో పారితోషికం రేంజ్ చాలా చిన్న‌ది. కానీ బాహుబ‌లి త‌ర్వాత అనూహ్య‌మైన క్రేజు రావ‌డంతో ఇప్పుడు ప్ర‌భాస్ రేంజ్ నిజంగానే అంత పెద్ద స్థాయికి ఎదిగింది. మ‌రి పీఆర్ టీమ్ ప్రాప‌కంతో అది స్టాండార్డ్ అయితేనే బావుంటుంది. ఎంత‌యినా మ‌న ప్ర‌భాస్ పెద్ద రేంజుకు ఎదగాల‌ని తెలుగువారంతా కోరుకుంటారు క‌దా!