Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అమెరికాకు చెందిన ప్రత్యేక సైనిక దళాలు, మన దేశానికి చెందిన నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎ్‌సజీ) హైదరాబాద్‌లో సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. రెండు దేశాల సైనిక దళాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించటం, ఒకరి అనుభవాలను మరొకరు పంచుకోవటం, తద్వారా సామర్థ్యాన్ని పెంపొందించుకోవటం ఈ సైనిక విన్యాసాల ప్రధాన లక్ష్యాలు. మంగళవారం ఈ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. భద్రతకు సంబంధించిన అంశాల్లో భారత్‌-అమెరికాల మధ్య గట్టి స్నేహ బంధం ఉందని, ఇది మరింత బలపడుతోందనటానికి ఈ విన్యాసాలేనిదర్శనమని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా వ్యాఖ్యానించారు.

దీని వల్ల రెండు దేశాలకూ లబ్ధి చేకూరుతుందని ఆమె అన్నారు. రక్షణ అంశాల్లో ఆసియా ఫసిఫిక్‌ ప్రాంతంలో భాగస్వామ్య దేశాలతో అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో భారత్‌-అమెరికాల మధ్య రక్షణ రంగంలో సహాయసహకారాలు బాగా పెరిగాయి. రక్షణ రంగ ఉత్పత్తుల విషయంలో హైదరాబాద్‌ చాలా కీలకమైన నగరంగా మారింది. ఈ నేపథ్యంలో సైనిక విన్యాసాలు జరగడం గమనార్హం.