Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

 ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్‌ ఖాతాలున్న 8 కోట్ల 70 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ ఓటర్లను ప్రభావితం చేయడానికి వాడుకోవడానికి అవకాశమిచ్చారనే ఆరోపణపై ఈ సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ మంగళవారం అమెరికా కాంగ్రెస్‌ ముందు తన సాక్ష్యం చెప్పడాన్ని వీక్షించిన అనేక మంది ఆయనపై ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో జోకులు పేల్చారు.

ట్రంప్‌ ప్రచారంతో ముడిపడిన కేంబ్రిడ్జ్అనలిటికా ఉదంతం వెలుగు చూశాక ఆయన మొదటిసారి కాంగ్రెస్‌ ముందు స్వయంగా వచ్చి తన వాదనలు వినిపించారు. 75 నుంచి 90 ఏళ్లు పైబడిన కురువృద్ధులున్న సెనెట్ కమిటీ ముందు జుకర్‌ బర్గ్‌ చెప్పిన విషయాలు ఈ పెద్దలకు ఏం మాత్రం అర్ధంకావని, ఈ సెనెటర్లకు ఫేస్బుక్‌ అంటే పూర్తిగా తెలిదనే విషయాన్ని నొక్కి చెబుతూ పలువురు ఆయనపై ట్విటర్లో జోకులు సంధించారు. మరి కొందరు నేరుగా జుకర్‌ బర్గ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. వాటిలో ఆసక్తికరమైనవి, వ్యగ్యం, చమత్కారం రంగరించినవి కొన్ని:

ఇరా మాడిసన్:  నా మనవడు నా ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను ఎందుకు ఆమోదించడం లేదో కారణం చెప్పండి!   ఓ సెనెటర్‌ ప్రశ్న

ఫుల్‌ఫ్రంటల్‌:  మిస్టర్ జుకర్‌బర్గ్‌, నేను పదేళ్లుగా ఫేస్బుక్‌ ఉన్నా నా రిక్వెస్ట్‌ను ఏ ఒక్కరూ ఎందుకు స్వీకరించలేదో చెప్పండి. మరో సెనెటర్ ఆవేదన

బాబ్‌ వూల్ఫ్‌వ్‌:  జుకర్‌ బర్గ్‌: ఫేస్‌బుక్‌కు సంబంధించి మీరు ఏ ప్రశ్న అడిగినా జవాబు చెబుతా.

84 ఏళ్ల సెనెటర్: బ్రహ్మాండం, జుకర్‌ బర్గ్‌! నా ఫామ్‌హౌస్‌లో మరిన్ని పందులు పెంచాల్సిన అవసరముంది. కాని, వాటిని ఎక్కడ కొనాలో తెలియడం లేదు.

రాబీ సోవ్: దేశంలోని వృద్ధులకు టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో వివరించడం కుర్రాళ్లకు కుదిరే పని కాదు. జుకర్‌ బర్గ్‌ ప్రస్తుతం ఆ పనిలో నిమగ్నమయ్యారు.