Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కొందరికి లో-బీపీ ఉంటుంది. ఇలాంటివారి శరీరంలో హైపోటెన్షన్ ఉండడం మూలాన రక్తప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. దీనినే లో బీపీ అంటారు. లో బీపీని తొలగించుకోవాలనుకుంటే మీరు తీసుకునే ఆహారంలో మార్పులు చేస్తే సరిపోతుందని అంటున్నారు వైద్యులు.

1. లో బీపీ ఉన్నవారు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఓ కప్పు చొప్పున బీట్రూట్ రసం తాగితే మార్పు మీరే గమనిస్తారంటున్నారు వైద్యులు. ఇలా ఓ వారం రోజులపాటు బీట్రూట్ రసం సేవిస్తుంటే ఫలితం ఉంటుంది.

2. ప్రతి రోజూ దానిమ్మరసం తీసుకోవడంతో రక్త ప్రసరణను క్రమబద్దీకరించి లో బీపీ సమస్య మటుమాయమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

3. లో బీపీ బారిన పడినవారు క్రమం తప్పకుండా వారం రోజులపాటు తాజాపండ్లను ఆహారంగా తీసుకుంటుంటే బీపీ క్రమబద్దం కావడంతోపాటు శరీర వ్యవస్థ మొత్తం మారి నూతన శక్తిని పొందుతారు.

4. లో బీపీతో బాధపడేవారు నిద్ర కూడా సరైన సమయానికి నిద్రించాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు దరిచేరవు.