Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రస్తుతం సొసైటీలో అత్యంత ప్రమాదకరంగా తయారైన అంశం ‘లైంగిక వేదింపులు’. ఈ వేదింపులు పలానా చోట మాత్రమే ఉంటాయని చెప్పలేం. ఆడవాళ్ళు మసిలే ప్రతి చోటా ఇవి ఉంటుంటాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా పసి పిల్లల దగ్గర్నుండి పండు ముసలాళ్ళ దాకా అందరూ ఈ లైంగిక వేదింపులకు గురవుతున్నారు. వీటిని ఆపాలని ప్రభుత్వం, పలు సంస్థలు చాలా చర్యలు తీసుకున్నాయి. కానీ ఆగలేదు. ప్రభుత్వం ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలు విదించినా కూడా ఆగటంలేదు.

వీటిని ఆపాలంటే భవిష్యత్ తరాలకు వీటి పై అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఇంట్లో పిల్లలకి. కానీ ఎదుగుతున్న పిల్లలతో ఇలాంటి చర్చలు ఎలా జరపాలి అని కొందరు తల్లి దండ్రులు ఆందోళన పడుతుంటారు. ఈ అంశాలను చర్చించుకోవడం తప్పుగా భావిస్తారని, ఇక తండ్రి కొడుకులు, తల్లి కొడుకుల మధ్య ఇలాంటి సంభాషణ ఎంతో పాపంగా భావిస్తారని కానీ జరగాల్సిన పద్ధతిలో వారి మధ్య జరిగితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నారు. ఇందుకోసం బ్రేక్ త్రో ఇండియా అనే సంస్థ ఒక నిమిషం లోపు వీడియోలోనే తమ పిల్లలు లైంగిక వేధింపుల చర్యలు పాల్పడకుండా ఓ తల్లి ఎలా వివరించాలో వివరించారు.

ఈ వీడియోలో తల్లి ఆడవాళ్ళ పై జరిగే లైంగిక వేదింపుల గురించి తన 16ఎళ్ళ కొడుక్కి సమయానుకూలంగా నెమ్మదిగా..అర్థమయ్యేట్టు తెలివిగా చెబుతుంది. తల్లి మాటలు విన్న కొడుకు అప్పటి వరకూ వేస్తున్న వెధవ వేషాలు తప్పని ఆలోచనలో పడతాడు. ఇలానే ప్రతి తల్లిదండ్రులూ తమ పిల్లలకు సందర్బాన్ని బట్టి ఈ అంశం పై అవగాహన కల్పించాలి. అప్పుడే ఈ దుశ్చర్యలు ఆగుతాయి.