Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రస్తుతం దేశంలో అన్ని రాజకీయ పార్టీలని, ప్రజలని తీవ్రంగా ఆలోచింప జేస్తున్న వార్త రాష్ట్రపతి ఎన్నిక, మరో కొద్దీ, ప్రస్తుతం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ త్వరలో ముగియనుంది. అయిన ఇప్పటి వరకు రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అన్ని ఊహాగానాలే నడుస్తున్నాయి తప్ప ఏ ఒక్కరిని కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఫైనల్ చేయలేదు. అయితే అధికారా బీజేపీ పార్టీ అన్ని పార్టీలని కలుపుకొని రాష్ట్రపతి ఎన్నిక నిర్వహిస్తామని చెబుతున్న వారికి అంతర్గత లాలూచి ఉందనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది.

అయితే ఈ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అధికారా బీజేపీ పార్టీ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రాష్ట్రపతి ఎంపికని ఏకగ్రీవం చేయడానికి అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతుందని తెలుస్తుంది. అయితే అధికార బీజేపీ పార్టీ ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థిగా ఒకరిని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఎలా అయినా ఆ వ్యక్తిని రాష్ట్రపతిగా చేయాలనే పట్టుదలతో పార్టీ ఉన్నట్లు, దానికి ఎదో విధంగా మిగిలిన పార్టీలని కూడా ఒప్పించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రపతి అభ్యర్థి తాము నిర్ధేశించిన వ్యక్తి ఉంటె. పరిపాలనలో ఎలాంటి ఆటంకం లేకుండా ఏవైనా చట్టాలు చేసిన వెంటనే ఆమోదం పొందే అవకాశం వుంటుందనే ఆలోచనతో పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బీజేపీ ఆలోచనలు పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవానికి అంగీకరించకూడదనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది.