Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఓ వైపు దాయాది పాకిస్తాన్ కవ్వింపు. మరోవైపు చైనా చొరబాటు. రెండు వైపుల నుంచి భారత్ కు తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఏదో ఒక వైపు అనుకోని రీతిలో యుద్ధం చేయాల్సి వస్తే. గతంలో చేశాంగా, ఇప్పుడెందుకు భయమనేగా? అప్పుడు ఓకే, కాని ఇప్పుడు ఓకే చెప్పేందుకు మన మిలిటరీ కాస్త తటపటాయించడం ఖాయం. గుండె ధైర్యం లేక కాదు. శత్రువును తరిమికొట్టేందుకు అవసరమైన ఆయుధ సంపత్తి సమృద్ధిగా లేకపోవడమే అందుకు కారణమట. సగటు భారతీయుడిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసే ఈ విషయాన్ని మన పాలకులు అంత సీరియగ్ గా పరిగణించడం లేదు. తత్ఫలితమే ప్రస్తుతం భారత సరిహద్దు వెంట అవసరమైన మేరకు ఆయుధ సంపత్తి అందుబాటులో లేదు.

సాధారణంగా ఎల్లప్పుడూ ఓ 30 రోజుల భీకర యుద్ధంతో పాటు మరో 30 రోజుల పాటు సాధారణ స్థాయి యుద్ధం జరిగినా, అందుకు సరిపడే ఆయుధ సంపత్తి సైన్యం వద్ద ఉండేది. ఒకవేళ 30 రోజుల తర్వాత కూడా భీకర యుద్ధం సాగితే, సాధారణ యుద్ధానికి సరిపడే మందుగుండు సామాగ్రితో మరో పది రోజుల పాటు నెట్టుకురావచ్చు. అంటే మొత్తం మీద 40 రోజులకు సరిపడ సాధన సంపత్తి సైన్యం వద్ద ఉండేదన్న మాట. అయితే తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కొన్ని రకాల ఆయుధాలైతే కనీసం వారం రోజుల దాకా కూడా సరిపోవని పేర్లు వెల్లడించేందుకు ఇష్టపడని సైనికాధికారులు వాపోతున్నారు.

గత ప్రభుత్వాల ఉదాశీనత కారణంగానే ఈ దుస్థితి నెలకొందన్న వాదన కూడా లేకపోలేదు. ఇప్పటికీ యుద్ధంలో కీలకంగా పరిగణిస్తున్న 23 శాతం ఆయుధాల కోసం దిగుమతులనే ఆశ్రయిస్తోందట భారత సైన్యం. పెరుగుతున్న బడ్జెట్ కేటాయింపుల నేపథ్యంలో దేశంలోని 39 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు రాత్రింబవళ్లు పనిచేసినా, 2019కి గాని సైన్యానికి పూర్తి స్థాయిలో సాధన సంపత్తి అందుబాటులోకి రాదట. ఇకనైనా రక్షణ రంగంపై మరితం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.