Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కావల్సినవి:

బాస్మతీ బియ్యం – రెండుకప్పులు (కడిగి నానబెట్టుకోవాలి), పుట్టగొడుగులు – పావుకేజీ, నూనె – రెండు టేబుల్‌స్పూన్లు, నెయ్యి – టేబుల్‌స్పూను, బిర్యానీ ఆకులు – రెండు, లవంగాలు – మూడు, దాల్చిన చెక్క ముక్కలు – రెండు, అనాసపువ్వు – ఒకటి, షాజీరా – చెంచా, వాము – చెంచా. కొబ్బరి పాలు – కప్పు.

మారినేషన్‌ కోసం:

పెరుగు – అరకప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద – టేబుల్‌స్పూను, కారం, ధనియాలపొడి – చెంచా చొప్పున, పసుపు – పావు చెంచా, గరంమసాలా – అరచెంచా, ఉప్పు – తగినంత, కొత్తిమీర, పుదీనా తరుగు – అరకప్పు.

తయారీ:

ముందుగా మారినేషన్‌ కోసం తీసుకున్న పదార్థాలన్నింటిన్నీ ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. తరవాత పుట్టగొడుగుల్ని ఆ మసాలాలో వేసి కలిపి అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచేయాలి. కుక్కర్‌లో నూనె, నెయ్యి వేసి పొయ్యిమీద పెట్టాలి. నెయ్యి కరిగాక బిర్యానీ ఆకులూ, లవంగాలూ, దాల్చినచెక్క ముక్కలు, అనాసపువ్వూ, షాజీరా, వాము వేయాలి. అవి వేగాక ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న పుట్టగొడుగు ముక్కలు వేయించాలి. రెండు, మూడు నిమిషాలయ్యాక కొబ్బరి పాలు, నానబెట్టుకున్న బియ్యం, రెండుంబావు కప్పుల నీళ్లూ, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేయాలి. మూడు కూతలు వచ్చాక దింపేస్తే సరిపోతుంది. కావాలనుకుంటే దీనిపై వేయించిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు.