Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రధాని అంటే దేశం మొత్తానికి అధినేత. ఏ ఒక్కరాష్ట్రానికొ, ప్రాంతానికో పరిమితమైన భాద్యత కాదు అది. ఆ పదవిలో ఉన్నపుడు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అలాంటి భాద్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి చిన్న పొరపాటు చేసినా దానిని పర్యవసానం దారుణంగా ఉంటుంది. నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా ఘోర తప్పిదం చేశారు. అన్ని భాషల్లో ప్రజలకు ఆయా ప్రాంతాలని బట్టి పొంగల్ శుభాకాంక్షలు తెలియజేసిన మోడీ తెలుగు వారిని మరచారు.

దీనిని చిన్న పొరపాటు అని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. దాదాపు 10 కోట్ల మంది ఉన్న రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలే గుర్తు లేకపోతే ఇక ఆయన ఎమ్ ప్రధాని అని తెలుగు ప్రజలు సోషల్ మీడియా వేదికగా నరేంద్ర మోడీ పై అటాక్ మొదలు పెట్టారు. గుజరాతి, కన్నడ, తమిళ మరియు ఇతర భాషలలో పొంగల్ శుభాకాంక్షలు తెలియజేసిన మోడీకి.. కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా టాక్సులు గుంజుకుంటున్న తెలుగు ప్రజలు గుర్తు లేకపోవడం బహు విచారకరం. ‘#తెలుగువాడంటేచులకనా’ అనే హ్యాష్ టాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. నిధులు విడుదల చేయకుండా తెలుగు ప్రజలని ఇబ్బందులు పెడుతున్న మోడీ అనేక రాజకీయా కారణాలని వల్లిస్తుంటారు. ప్రత్యేక హోదా ఇవ్వమంటే బిజెపి నాయకులు ఎన్నిరకాల కారణాలు చెప్పారో అందరికి తెలిసిందే. ఇప్పుడు మోడీ చేసిన ఈ పనికి ఏమని సమాధానం చెబుతారో.. మోడీ సోషల్ మీడియా టీం చేసిన చిన్న పొరపాటు అని తప్పించుకుంటారా..!