Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ప్రపంచ గతినే మార్చేసాడంట. ఇప్పటి వరకు ప్రపంచం లో ఎవరికీ సాధ్యం కాని పనిని చేసి చూపించి ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ గ్లోబల్ గేమ్స్ చేంజర్ జాబితాలో అగ్రస్థానం లో నిలిచారు. అత్యంత చౌకగా వేగవంతమైన ఇంటర్ నెట్ సేవలని దేశవ్యాప్తం అందించి తక్కువ కాలంలోనే 10 కోట్ల మంది జియో వినియోగదారులని సొంతం చేసుకున్న వ్యక్తిగా ఫోర్బ్స్ ఆయనకి ఈ గుర్తింపు ఇచ్చింది. ప్రపంచ గతిని, ఇతరులపై ప్రభావాన్ని చూపించిన టాప్ టెన్ వ్యక్తుల జాబితాని ఫోర్బ్స్ రీసెంట్ గా ప్రకటించింది. ఇందులో పెట్రోలియం అండ్ గ్యాస్ ఇండస్ట్రీ లో తనదైన పంథాలో దూసుకుపోతున్న రిలయన్స్ దిగ్గజం టెలికాం రంగంలో కూడా ఒక్కసారిగా తన ప్రభంజనం చూపించడం. ప్రపంచం ద్రుష్టిని, ఫోర్బ్స్ దృష్టిని ఆకర్షించింది. దీంతో ముకేష్ అంబానికి ఫోర్బ్స్ మొదటి స్థానం కట్టబెట్టింది. ఈ గుర్తింపు భారత దేశంలో ఓ కార్పోరేట్ దిగ్గజానికి వచ్చిన గుర్తింపు మాత్రమె కాదు. ప్రపంచ మార్కెట్ లో భారత్ మేధావుల హవా ఎ స్థాయిలో వుందో చెప్పడానికి నిద్రర్శనంగా నిలుస్తుంది. ఈ గుర్తింపుని చూసిన భారతీయులందరు నిజంగా గర్వపడాలి.