Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అధికారంలో ఉన్నప్పుడు తనదైన శైలిలో రాజకీయాన్ని నడిపించిన కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అన్ని అనుకూలంగా ఉన్నాయన్న ఆయనకు బెంగుళూరు కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఎపుడైనా ఆయనను అరెస్టు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. 2007 లో అధికారంలో ఉన్న ఆయన పార్టీలో అనేక కుంభకోణాలు జరిగాయని ప్రతిపక్షాలు అరోపించాయి. ముఖ్యంగా మైనింగ్ వ్యవహారంలో జంతకల్ ఎంటర్‌ప్రైజస్‌ అనే సంస్థకు సహకరించి పెద్ద స్కామ్‌కు పాల్పడినట్టు రాష్ట్ర లోకాయుక్త తప్పుపట్టింది. ఇప్పటికే ఓ సీనియర్ ప్రభుత్వ అధికారిని అరెస్టు చేయగా.. ఆయన ను కూడా అరెస్టు చేస్తారేమో అని బెయిల్ దరఖాస్తు చేసుకోగా కోర్టు ఒప్పుకోలేదు దీంతో ఆయనను అరెస్టు చేయవచ్చునని తెలుస్తోంది.