Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మసాజ్‌లు ఇచ్చే ఉపశమనం మాటల్లో చెప్పలేనిది. వీటి వల్ల శరీరం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఆరోగ్యమైన జీవనశైలికి డైట్‌, వ్యాయామాలు ఎంత ముఖ్యమో మసాజ్‌ కూడా అంతే అవసరం. మసాజ్‌ల వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకు పోతాయి.
 
టెంపుల్‌ మసాజ్‌…
ఈ మసాజ్‌ శరీరంపై తేలికపాటి ఒత్తిడిని కలుగజేస్తుంది. స్ట్రెచింగ్‌కు సహాయపడుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. నిద్ర బాగా పడుతుంది. అంతేగాక శరీరంలోని ఎనర్జీని సమతుల్యం చేస్తుంది. కండరాల ఒత్తిడిని పోగొట్టి ఫ్లెక్సిబుల్‌ చేస్తుంది.
డీప్‌ టిష్యూ మసాజ్‌…
నిత్యం వర్కవుట్లు చేయలేనివారికి ఈ మసాజ్‌ బాగా ఉపయోగపడుతుంది. వర్కవుట్లు చేయలేని వాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే వారానికొకసారి ఈ మసాజ్‌ని చేయించుకోవాలి. దీని వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మెదడు, శరీరం బాగా రిలాక్స్‌ అవుతాయి. రకరకాల శరీర నొప్పుల్ని, బాధల్ని పోగొడుతుంది. ‘టెక్స్టింగ్‌ నెక్‌’ (మొబైల్‌లో తరచూ మెసేజ్‌లిస్తుండడం వల్ల మెడకు తలె త్తే నొప్పులు), ‘హంచ్డ్‌ ఒవర్‌ లాప్‌టాప్‌ సిండ్రోమ్‌’ (హెచ్‌ఔల్‌ఎస్‌) సమస్యలు కూడా తగ్గుతాయి.