Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మీకు కోపం వచ్చినప్పుడు, శరీరం ఒత్తిడికి గురైనప్పుడు, మనసు చిరాకుగా ఉన్నప్పుడు భోజనం తీసుకోవడం మంచిదికాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడం కోసమే ఆహారం తీసుకుంటాం. ఇది శరీర ధర్మం. దీంతోబాటు వ్యాయామం కూడా కచ్ఛితంగా చేయాలంటున్నారు వైద్యులు.

వయసు పెరిగేకొద్ది శరీర జీర్ణక్రియలో మార్పు వస్తుంది. కాబట్టి పెద్దవారు నడక, వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. మీరు తీసుకునే ఆహారం రుతువులనుసరించి ఉండాలి. అదికూడా నియమిత సమయానుసారం ఆహారం తీసుకుంటూ ఉండాలి. సమయం మించిపోతే భోజనం చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే.. సమయం మించిపోతే ఆకలి అంతగా ఉండదు. ఒకవేళ తిన్నా ఒంటికి పట్టదు. కనుక వీలైనంత వరకు సమయానికి భోజనం చేయడం మంచిది.

భోజనంతో పాటు నీళ్ళు త్రాగకండి. భోజనానికి అరగంట ముందు, అరగంట తర్వాత మాత్రమే నీళ్ళు త్రాగాలంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారాన్ని తీసుకోండి. ఎట్టిపరిస్థితుల్లోనూ సమయాన్ని మార్చకండి. ఇది అనారోగ్యానికి దారి తీస్తుంది. శరీరం అలసిపోయేంతవరకు పగలు పని చేయండి. దీంతో ఆకలి వేస్తుంది. నిద్రకూడా బాగా పడుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.