Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

యుకేలో గురువారం జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ దాటి ఆధిక్యంలో కన్జర్వేటివ్ పార్టీ ఉండటంతో మరో ఐదేళ్లపాటు డేవిడ్ కామెరాన్ ప్రధానిగా కొనసాగడం ఖాయమైంది. మొత్తం 650 ఎంపీ సీట్లకు గానూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 326 సీట్లు గెలవాల్సి ఉంది. అయితే కన్జర్వేటివ్ పార్టీ ఇప్పటికే 329 సీట్లు కైవసం చేసుకుని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. కాగా, ప్రతిపక్ష లేబర్ పార్టీ ఇప్పటి వరకు 233 సీట్లు గెలుచుకుంది. దీంతో కన్జర్వేటివ్ పార్టీ గెలుపు ఖాయమైంది. తమ పార్టీ గెలిచిన ఎంపీ సంఖ్య 57 నుంచి 8కి పడిపోవడంపై ఏమీ స్పందించలేనని లిబ్ డెమ్ నాయకుడు నిక్ క్లేగ్ ఇప్పటికే ప్రకటించారు. యుకెఐపి నాయకుడు నైజెల్ ఫరాజ్ తానెట్ సౌత్ నుంచి పోటీ చేసి 2,800 ఓట్ల తేడాతో ఓడిపోయి మౌనంగా ఉండిపోయారు. కాగా, బిబిసి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కన్జర్వేటివ్ పార్టీకి 331, లేబర్ 232, లిమ్ డెమ్స్ 8, ఎస్ఎన్పీ 56, ప్లేయిడ్ సిమ్రు 3, యుకెఐపి 1, ది గ్రీన్స్ 1, ఇతరులకు 19 సీట్లు వస్తాయని పేర్కొంది.