Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ కింద బ్రెడ్ తినడం చాలా మందికి అలవాటు. ఈ అలవాటు మంచిది కాదంటున్నారు వైద్యులు. ఆధునిక ఆహారశైలి కారణంగా ఉదర సంబంధ సమస్యలతోపాటు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా బ్రెడ్, పాస్తా వంటివి అధికంగా తీసుకునే వారిలో మానసిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయంటున్నారు.

అందుకు కారణం బ్రెడ్డులో గ్లూటెన్ అనే ఆమ్లం. ఇది మెదడు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వారు చెబుతున్నారు. బ్రెడ్ తిన్న తరువాత పండ్లు తీసుకుంటే కొంతవరకూ సమస్య నుండి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

బ్రెడ్‌లోని ఆమ్లాలు శరీరాన్ని ఒత్తిడికి గురిచేస్తాయి. దాంతోపాటు ఆకలిని తగ్గిస్తాయి. కనుక ఉదయాన్నే బ్రెడ్ తీసుకోవడం మానేయండి. లేదంటే పలురకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌కు బ్రెడ్‌కు బదులు ఇడ్లీ వంటివి ఇంటి మంచిదంటున్నారు.

ఆధునిక ఆహారశైలి కారణంగా ఉదర సంబంధ సమస్యలతోపాటు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. బ్రెడ్ తీసుకోవడం వలన మెదడు పనితీరు తగ్గిపోతుందని చెప్తున్నారు. కనుక వీలైనంత వరకు బ్రెడ్ తీసుకోవడం తగ్గిస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన్నట్టవుతుంది.