Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

బడ్జెట్‌లో  కేంద్ర ప్రభుత్వం  ప్రకటించిన   బీటెక్‌ విద్యార్థుల ఫెలోషిప్‌ పథకంపై  కేంద్రం శరవేగంగా కదులుతోంది.  అత్యుత్తమ ప్రతిభగల  వెయ్యి మంది బీటెక్‌ విద్యార్థులకోసం ఉద్దేశించిన  పీఎం రీసెర్చ్ ఫెలోషిప్స్(పీఎంఆర్‌ఎఫ్)  పథకానికి కేబినెట్‌ ఆమోదం లభించింది. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి వెళ్లే ఔత్సాహికులకు ప్రోత్సాహిమిచ్చే దశగా ఈ ఫెలోషిప్‌ను ఇవ్వనున్నామని  కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్  ప్రకటించారు.  ఇందుకోసం రూ.1,650 కోట్లను కేటాయించినట్టు చెప్పారు.   తద్వారా విద్యార్థుల బ్రెయిన్‌ డ్రెయిన్‌ శ్రమను..బ్రెయిన్‌ గెయిన్‌గా మార్చుతున్నామన్నారు.

2018-19 నుంచి మూడేళ్లపాటు  ప్రతి ఏడాది 1000 మంది పీహెచ్‌డీ విద్యార్థుల కోసం  ఈ నిధులను ఖర్చు చేయనున్నామని  మంత్రి వెల్లడించారు. అర్హత కలిగిన విద్యార్థుల నుంచి తుది జాబితాను ఎంపిక చేస్తారు. వీరందరూ మొదటి రెండు సంవత్సరాలకు నెల‌కు రూ.70వేలు, మూడో ఏడాది రూ.75వేలు, నాలుగు, ఐదో సంవత్సరం రూ.80వేల స్కాలర్‌షిప్ పొందనున్నారు.  అంతేకాదు  అధ్యయన  పేపర్ల  ప్రజెటింగ్‌ కోసం విదేశాల్లో  సెమినార్లు, కాన్ఫరెన్సెలకు వెళ్లే అధ్యయన విద్యార్థులకు వార్షికంగా   (విదేశీ ప్రయాణ ఖర్చులు)మరో రెండు లక్షల  రూపాయలు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు స్కాలర్‌షిప్‌లు కూడా అందిస్తున్నామని మంత్రి వివరించారు.

 పీఎం రిసెర్చ్ ఫెలోషిప్స్(పీఎంఆర్‌ఎఫ్) పథకం కింద.. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఐఐఎస్‌సీ, ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌ఈఆర్, ఐఐఐటీల్లో బీటెక్ పూర్తయిన  లేదా చివరి సంవత్సరం చదువుతున్న, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎమ్మెస్సీ(సైన్స్ అండ్ టెక్నాలజీ) విద్యార్థులు నేరుగా ఐఐటీలు, ఐఐఎస్‌లో పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం లభించనుంది.