Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఫ్యాట్కిన్స్‌ డైట్‌

 ఊబ  కాలమ్‌

1972లో ఒక పుస్తకం సంచలనం రేపింది.డాక్టర్‌ ఆట్కిన్‌ అనే ఆయన ‘ఆట్కిన్స్‌ డైట్‌’ పేరుతో ఆ పుస్తకం రాసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. బరువు తగ్గడానికి ఇది శ్రేష్టమైన మార్గమనిసూచించాడు.ఆచరించినవాళ్లు అవునని అన్నారు.మీరూ ఆచరించి చూడండి…  ఫ్యాట్‌తో ఫ్యాట్‌ని కిల్‌ చేసే ఈ డైట్‌ని పరిశీలించి చూడండి.

బరువు తగ్గడానికి సమర్థంగా సహకరించే డైట్‌ ప్రక్రియల్లో ఆట్కిన్స్‌ డైట్‌ ఒకటి. ఇది తక్కువ పిండిపదార్థాలు ఎక్కువ ప్రొటీన్లు, కొవ్వులు ఉన్న డైట్‌ ప్రక్రియ. డాక్టర్‌ రాబర్ట్‌ సి. ఆట్కిన్‌ అనే ఫిజీషియన్‌ 1972లో రాసిన ఒక పుస్తకంలో దీన్ని పొందుపరచాడు. ఆ పుస్తకం ఆనాటి బెస్ట్‌ సెల్లర్‌గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఈ ఆహార ప్రక్రియలను అంతో ఇంతో తమ తమ ప్రాంతాలకు అనుగుణంగా, అనువుగా మార్చుకుని ప్రయోజనం పొందారు.

ఈ ఆహార ప్రక్రియలోని ప్రధాన ప్రిన్సిపుల్‌ స్వాభావికమైన కొవ్వులైన నెయ్యి వంటి శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ను ఎంతైనా తీసుకోమని చెప్పడం. ఎందుకంటే అవి అంత హానికరం కాదు. మార్కెట్‌ లో దొరికే లో–ఫ్యాట్‌ డైట్స్‌ కంటే ఇలాంటి శాచ్యురేటెడ్‌ కొవ్వులే రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం, చెడు కొలెస్ట్రాల్‌ను పరిమితం చేయడం ద్వారా గుండెజబ్బులను నివారిస్తాయి. బరువును తగ్గిస్తాయి. ఈ ఆహార విధానంలోని మరో ముఖ్యాంశం పిండిపదార్థాలను తగ్గించడం. దీని వల్ల బరువు తగ్గుతారు. ఎందుకంటే పిండిపదార్థా లతో ఎంతోసేపటికి గానీ తృప్తి కలగదు. అదే ప్రొటీన్లు తినడం వల్ల త్వరగా తృప్తి కలుగుతుంది. దాంతో కార్బోహైడ్రేట్లను తగ్గించడం వల్ల ప్రొటీన్లను ఒంటికి అవసరమైనంతే తినడంతో ఆటోమేటిగ్గా బరువు తగ్గుతారు.
ఆట్కిన్స్‌ ౖడైట్‌ అనుసరించేవారు నాలుగు దశల్లో దీన్ని అమలు పరచవచ్చు. అవి…

►మొదటి దశలో (దీన్ని ఇండక్షన్‌ దశ అంటారు): రోజుకు కేవలం 20 గ్రాముల కంటే తక్కువ పిండిపదార్థాలను (అంటే ఆకుకూరలు, కాయ గూరలను) మాత్రమే తీసుకుంటూ రెండు వారాలు కొనసాగించాలి. ఈ సమయంలో ఎక్కువ ప్రొటీన్, ఎక్కువ కొవ్వులు ఉండే మాంసాహారాలు రోజుకు మూడుపూటలా తీసు కోవచ్చు.
►రెండో దశలో (దీన్ని బ్యాలెన్సింగ్‌ దశ అంటారు) : ఇప్పుడు రెండువారాలుగా తీసుకునే ఆహారానికి మెల్లగా నట్స్, డ్రైఫ్రూట్స్, పండ్లు వంటి వాటిని జతచేయవచ్చు. ఇలా మరో రెండు వారాలు కొనసాగించాలి.
►మూడో దశలో (దీన్ని ఫైన్‌–ట్యూనింగ్‌ దశ అంటారు) : ఇందులో మీరు కోరుకున్న లక్ష్యానికి చేరువ అవుతూ చాలావరకు బరువు తగ్గుతారు. అప్పుడు మీ ఆహారానికి మరికొన్ని కార్బో హైడ్రేట్లను చేర్చవచ్చు.
►నాలుగో దశలో (దీన్ని నిర్వహణ దశ లేదా మెయింటెనెన్స్‌ దశ అంటారు): ఇక ఇప్పటి నుంచి మీరు ఆరోగ్యకరమైన పిండిపదార్థాలను మాత్రమే తీసుకుంటూ ఉన్నప్పటికీ ఎలాంటి పైన పేర్కొన్న మూడు దశల్లోని హై–ప్రొటీన్లు, ఎక్కువ కొవ్వులు తీసుకుంటున్నా బరువు పెరగకుండా స్థిరంగా ఉంటారు.
ఒక సూచన : ఇక్కడ పేర్కొన్న దశలు పాటించడానికి కాస్త సంక్లిష్టంగానే ఉంటాయి. అందుకే కొంతమంది ఇండక్షన్‌ దశలోకి వెళ్లకుండానే నేరుగా రెండో దశ నుంచి ప్రారంభిస్తారు. అయితే కొంతమంది మాత్రం ఎంతకూ ఇండక్షన్‌ దశలోనే ఉండిపోతారు. ఈ ఆట్కిన్స్‌ డైట్‌ ప్రభావవంతంగా పనిచేసే ప్రక్రియే. ఇది ఇంచుమించూ కాస్త కీటోజెనిక్‌ డైట్‌ ప్రక్రియకు దగ్గరగా ఉంటుంది.

ఆట్కిన్స్‌ ప్రక్రియలో దూరంగా ఉండాల్సిన ఆహారాలు : 
►చక్కెరలు : శీతల పానీయాలు, పళ్లరసాలు, కేకులు, క్యాండీలు, ఐస్‌క్రీములు.
► ధాన్యాలు : గోధుమలు, రే, బార్లీ, వరి.
► వెజిటెబుల్‌ ఆయిల్స్‌ : సోయా నూనె, మొక్కజొన్న నూనె, పత్తిగింజల నుంచి తీసిన నూనె (కాటన్‌ సీడ్‌ ఆయిల్‌)… ఇలాంటివే మరికొన్ని.
► కొవ్వులు / ట్రాన్స్‌ఫ్యాట్స్‌ : హైడ్రోజనేటెడ్‌ ఆయిల్స్‌ అని పిలిచే ప్రాసెస్‌ చేసిన నూనెల నుంచి దూరంగా ఉండాలి.
►   కార్బ్‌ డైట్‌ : ఎక్కువ చక్కెరలు ఉండే కార్బోహైడ్రేట్‌ డైట్‌.
►   హై–కార్బ్‌ వెజిటెబుల్స్‌ : క్యారెట్లు, టర్నిప్‌లకు దూరంగా ఉండాలి.
►   హై–కార్బ్‌ పండ్లు : అరటిపండ్లు, ఆపిల్స్, నారింజ, పియర్స్, ద్రాక్ష పండ్లకు దూరంగా ఉండాలి.
►    పిండి పదార్థాలు (స్టార్చ్‌) : బంగాళదుంప (ఆలూ), చిలగడదుంపలకు దూరంగా ఉండాలి. (వీటిని ఇండక్షన్‌ దశలో మాత్రమే
తీసుకోవచ్చు)
►  లెగ్యూమ్‌లు : చిక్కుళ్లు, బీన్స్, చిక్‌పీస్‌ వంటివాటికి దూరంగా ఉండాలి. (వీటిని ఇండక్షన్‌ దశలో మాత్రమే తీసుకోవచ్చు)

తీసుకోదగిన ఆహారాలు : 
ఆట్కిన్స్‌ డైట్‌లో భాగంగా ఈ కింద పేర్కొన్న ఆహారాలను తీసుకోవచ్చు.
►మాంసాహారాలు : వేట మాంసం, చికెన్‌
►చేపలు / సీఫుడ్‌ : సాల్మన్, సార్డిన్‌ చేపలు.
► గుడ్లు : ఒమెగా 3– ఫ్యాటీ యాసిడ్స్‌ ఉన్న అన్ని ఆరోగ్యకరమైన గుడ్లు.
►తక్కువ పిండిపదార్థాలు ఉండే కూరగాయలు / ఆకుకూరలు : పాలకూర, బ్రాకలీ, అస్పారగాస్‌ వంటివి.
► కొవ్వులు ఎక్కువగా ఉండేవి: వెన్న, చీజ్, మీగడ, కొవ్వులు తీయని పెరుగు.
►ఎండుఫలాలు / నట్స్‌ : బాదం, మాకడామియా నట్స్, వాల్‌నట్, పొద్దుతిరుగుడు గింజలు… మొదలైనవి.
►ఆరోగ్యకరమైన నూనెలు : ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్, కొబ్బరినూనె, అవకాడో నూనె.
మీ ఆహారంలో పిండిపదార్థాలు తక్కువగానూ, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, నట్స్‌ ఎక్కువ గానూ ఉన్నంతకాలం మీరు బరువు పెరిగేందుకు అవకాశం ఉండదు.

తీసుకోదగిన పానీయాలు : 
ఆట్కిన్స్‌ డైట్‌ తీసుకుంటున్నప్పుడు తీసుకో దగిన పానీయాలు ఇవి.
►నీళ్లు: మీరు ఎప్పుడు తాగినట్టుగానే నీళ్లు తాగవచ్చు.
►కాఫీ : కొన్ని అధ్యయనాల ప్రకారం కాఫీలో ఆరోగ్యాన్నిచ్చే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందువల్ల పరిమితంగా కాఫీ తీసుకోవచ్చు.
►గ్రీన్‌ టీ : ఇది ఎంతో ఆరోగ్యకరమైన పానీయం.
మొత్తం మీద ఇలా ఆట్కిన్స్‌ డైట్‌ అన్నది బరువు తగ్గడానికి ఒక నమ్మకమైన ప్రక్రియ అనీ, అది చాలావరకు నిరాశ పరచదన్నది నిపుణుల మాట.

ఆట్కిన్స్‌ డైట్‌లో తీసుకోదగ్గ కూరలతో తమకు ఇష్టమైన రీతిలోనూ తమ సౌలభ్యాన్నీ, తినుబండారాల లభ్యతను బట్టి ఆయా వ్యక్తులు తమ డైట్‌ తీసుకోవచ్చు. లేదా నిపుణులతో చర్చించి తమకు అనువైన వ్యక్తిగతమైన డైట్‌ను రూపొందించుకోవచ్చు. అలా చేయలేనప్పుడు ఈ కింద పేర్కొన్న సాధారణ డైట్‌ ప్లాన్‌ను అనుసరించవచ్చు.  ఈ ప్లాన్‌లో భాగంగా వారం రోజుల పాటు తీసుకోవాల్సిన డైట్‌ ఇలా…

శాకాహారులకు డైట్‌ – డైట్‌ ప్లాన్‌
ఇక శాకాహారులైతే ఈ కింద పేర్కొన్న ఆహారా లను తమ డైట్‌ ప్లాన్‌గా చేసుకోవచ్చు. వీటిని లంచ్‌ / డిన్నర్‌ ఆప్షన్‌గా లేదా ఏ కాంబినేషన్లతో నైనా, ఎలాగైనా ఎంచుకొని మార్చుకుంటూ తీసుకోవచ్చు. అవి…
► రాజ్మా టొమాటో కర్రీ/దీనికి చాలా రకాల ఆకు కూరలు కలుపుకొని సలాడ్‌గా తీసుకో వచ్చు.
► ఉడికించిన శనగలు / చిక్‌ పీస్‌ను రాగి రొట్టెలు లేదా రాగి జావతో తీసుకోవచ్చు.
► ఆలివ్‌నూనెలో టొమాటోలతో పాటు కాస్తంత వేపిన మొలకెత్తిన పెసర్లు
►అన్ని రకాల గింజల మొలకలను రుబ్బుకొని దోశలా వేసుకోవచ్చు. ఈ దోశను కొబ్బరినూనె లేదా వెన్నలో వేసుకోవచ్చు.
►  శనగపిండిలో పాలకూర కలుపుకొని వెన్నలో తేలిగ్గా వేపుకోవచ్చు.
► సజ్జరొట్టె / జొన్నరొట్టెలను సోయాబీన్‌ టొమాటో కర్రీతో పాటు తీసుకోవచ్చు.
►  పనీర్‌ బుర్జీ
►  పాలకూరతో పాటు పెసరతో చేసిన చట్నీ లేదా పెసర పప్పు
►    శనగపప్పు + పాలకూర
►  పనీర్‌ టిక్కా (ఇంట్లో చేసుకున్నది)