Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

చాలామందికి బస్సు ప్రయాణం పడదు. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కడుపులో తిప్పినట్లుగా ఉంటుంది. దీని కారణంగా వాంతులు అవుతుంటాయి. ఎక్కువగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలా చాలామందికి వాహనాల ప్రయాణం సమయంలో వాంతులు అవుతుంటాయి. అలాంటి వారు ప్రయాణానికి ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య రాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

చిన్న అల్లం ముక్కను బుగ్గ లోపల పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం చాలా తక్కువ. అల్లంలో క్యాల్షియం, పాస్పరస్, మెగ్నిషియం, ఐరన్, కాపర్, జింక్ వంటి ఖనిజాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వక్కపొడిని చప్పరించినా వాంతి సమస్యనుండి బయట పడవచ్చు.

నిమ్మకాయను కొద్దికొద్దిగా నలుపుతూ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీలిస్తే కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. లవంగాలు, సోంపు వంటివి దవడలో పెట్టుకుని చప్పరించినా కూడా వాంతులు రాకుండా ఉంటాయి. వాంతులు ఎక్కువగా వచ్చేవారు కారు, బస్సు ఎక్కినప్పుడు ముందు సీట్లో కూర్చుని పరిసరాలను గమనిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు.