Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

Image

 మనిషైనా.. జంతువైనా తల్లి ప్రేమలో మార్పుండదని, కన్నబిడ్డలు ఆపదలో పడితే తల్లి ప్రాణాలకైనా తెగిస్తుందని ఈ సంఘటన నిరూపిస్తోంది. అడవి దున్నల మంద నుంచి తన పిల్లలను తప్పించేందుకు ఓ సివంగి చేసిన ప్రయత్నాలను లారెంట్‌, డామినిక్‌ అనే ఫొటోగ్రాపర్లు కెమెరాలో బంధించారు. కెన్యా అడవులలో చోటు చేసుకుందీ ఘటన. సినిమాను తలపించే సన్నివేశాలు.. ‘ది లయన్‌ కింగ్‌’ సినిమాలో సరిగ్గా ఇలాంటి సన్నివేశంలో చిక్కుకున్న కొడుకును రక్షించుకొని సింహం ప్రాణాలు విడుస్తుంది.. ఇప్పుడూ అలాగే జరుగుతుందా..? క్షణ క్షణం ఉత్కంఠతను రేకెత్తించి, ఎట్టకేలకు సుఖాంతంమైంది. దున్నల మంద నుంచి తప్పించుకునే క్రమంలో ప్రవాహంలో దూకి, ఈదుతూ అవతలి ఒడ్డెక్కాలన్న సివంగి ప్రయత్నం సఫలం అయింది. అయితే దాని పిల్లలు మాత్రం కిందే ఉండిపోయాయి. కాలువ ఒడ్డు ఎక్కడం వాటివల్ల కాలేదు. ఒడ్డుపై పాదాలకు సరిగా పట్టు చిక్కకపోవడంతో కొంతదూరం పైకెక్కినా మళ్లీ కిందికి జారుతున్నాయి. దీంతో ఆందోళనతో అవి ఏడుస్తుంటే.. ధైర్యం చెబుతూ, పైకి లాక్కునే ప్రయత్నం చేసిందా సివింగి. కొంతసేపు ఆందోళన కలిగించినా.. సివంగి కాస్త కిందికి జారి వాటిని పైకి లాక్కోవడంతో కథ సుఖాంతమైంది.