Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పిల్లల నుండి పెద్దల వరకు అలవాటవుతోన్న సరికొత్త సమస్య ఫోన్స్ వాడకం. దీనికి బానిసలైపోతున్నారు. అమ్మనాన్నలిద్దరూ ఉద్యోగస్థులు కావడం, ఎప్పుడూ బిజీగా ఉండడం, ఒకవేళ అమ్మ ఇంట్లో ఉన్నా తన పనుల్లో మునిగి ఉండడం తరచు జరుగుతుంది. ఇది ఇలా ఉంటే.. నేటి తరుణంలో పెద్దల కంటే పిల్లలే ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారు.

ఎప్పుడు చూసినా సోషన్ మీడియా వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి వాటితోనే కాలక్షేమం చేస్తున్నారు. ఈ పద్ధతి పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు వైద్యులు. ఎక్కువగా ఫోన్స్ వాడితే కలిగే దుష్ప్రభావాల గురించి వారికి చెప్పి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుండాలి. లేదంటే కష్టమే అంటున్నారు. మీరు పిల్లలు ఎవరైనా ఖాతాలో డబ్బులు వేయమని అడిగితే వేయకూడదని చెప్పాలి. అలానే ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ పరిచయమైన వ్యక్తులు బయట కలుస్తామంటే వెళ్లకూడదని చెప్పాలి.

ముఖ్యంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరైనా ఏమైనా అంటారని దాచిపెట్టకూడదని చెప్పండి. తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పిల్లలను గమనిస్తుండాలి. అసలు నిజం చెప్పాలంటే పిల్లలు పెద్దవారిని చూస్తూ నేర్చుకుంటారు. అందుకే ముందు మార్పు పెద్దవాళ్ల నుండే మొదలవ్వాలి. అప్పుడే ఎలాంటి సమస్యనైన తేలికగా తీర్చొచ్చు.

ఫోన్ వాడకాన్ని తగ్గించాలంటే.. ప్రతిరోజూ ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక అందరూ కలిసి కాసేపు కబుర్లు చెప్పుకోవాలి. వారంలో ఒక రోజు కుటుంబంతో కలిసి అలా బయటకు వెళ్ళాలి. ఇలా అందరూ కలిసి ఉంటే మానవసంబంధాలు, అమ్మానాన్నలపై ప్రేమాభిమానాలతోపాటు గౌరవం కూడా పెరుగుతుంది. క్రమశిక్షణ అనేది ప్రతి విషయంలో అలవాటు చేయాలి. అది లేనప్పుడే రకరకాల దురలవాట్లకు లోనవుతుంటారు.