Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పిల్లల్ని పొగుడుతున్నారో లేదో ఇతరులతో పోల్చడం మాత్రం కూడదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. పొగడటం, పోల్చటం ఈ రెండే పిల్లల మానసికతపై ప్రభావం చూపుతాయని వారంటున్నారు. చిన్నారి ప్రాయం నుంచి టీనేజ్ వరకు పిల్లలను కంట్లో పెట్టుకుని చూసుకోవాల్సిన పరిస్థితి.
సమాజంలో చిన్నారులపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్న తరుణంలో పిల్లలను వారు చేసే మంచి పనులను తల్లిదండ్రులు తప్పకుండా పొగడాల్సిందేనని మానసిక నిపుణులు అంటున్నారు. అయితే ఇతరులతో పోల్చడం మాత్రం చేయకూడదని వారు హెచ్చరిస్తున్నారు.
పక్కింటి పిల్లలు చేసే పనులతో మీ పిల్లల్ని పోల్చడం ద్వారా చిన్నారుల మానసిక పెరుగుదల దెబ్బతింటుంది. అందుచేత మీ పిల్లలు చేసే చిన్న చిన్న పనుల్ని మెచ్చుకోవడం చేయాలి. అయితే వారిని ఇతరుల ముందు అవమానించకూడదు. అలాగే ఇతరులతో పోల్చనూ కూడదు. పిల్లల సత్తా, ఆసక్తిని గమనించి వారిని ఎదుగుదలకు తల్లిదండ్రులు తోడ్పడాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.