Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సైనిక నిఘాలో భాగంగా గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో తిరుగుతున్న పాకిస్థాన్‌ డ్రోన్‌ను భారత ఆర్మీ మంగళవారం ఉదయం కూల్చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎయిర్‌ డిఫెన్స్‌ మిసైల్‌ సిస్టం ‘స్పైడర్‌’ సాయంతో పాక్‌ డ్రోన్‌ను నేలమట్టం చేశారు. ఇందుకోసం ఇజ్రాయెల్‌కు చెందిన డెర్బీ అనే డ్రోన్‌ను వాడారని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌కు చెందిన గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ ‘స్పైడర్‌’ను భారత్‌ వాడటం ఇదే తొలిసారి. ప్రత్యర్థి యుద్ధవిమానాలను ముందస్తుగా గుర్తించి కూల్చడంలో సైన్యానికి ‘స్పైడర్‌’ అత్యంత కీలకం కానుంది. 2017 నుంచి ‘స్పైడర్‌’ వ్యవస్థ ఆర్మీకి అందుబాటులోకి వచ్చింది. పూల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో పీవోకేలోని ఉగ్రవాద మూకలపై భారత వైమానిక దళం మెరుపుదాడులు జరపడంతో ‘స్పైడర్‌’ ఉపయోగం ప్రాధాన్యం సంతరించుకుంది.