Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కొన్నిరోజుల విరామం తరువాత ట్వీట్లతో విరుచుకుపడ్డాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. కొన్నిరోజుల క్రితం వరకు మెగా బ్రదర్ నాగబాబుపై విరుచుకు పడిన వర్మ ఈ సారి తమిళనాడులో జరుగుతున్న జల్లికట్టుపై ట్వీట్ల వర్షం కురిపించాడు. సినీ పరిశ్రమ మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి జల్లికట్టుకు మద్దతు తెలుపుతుంటే వర్మ మాత్రం జల్లి కట్టు కోసం ఆందోళన చేస్తున్న మద్దతుదారులపై ట్వీట్లతో నిప్పులు చెరిగాడు.

ప్రభుత్వం సినిమాల్లో కాకులను, కుక్కలను చూపించడం కూడా నేరమని చెప్తూ, సంప్రదాయం పేరుతొ ఎద్దులను రాక్షసంగా హింసించడం సమర్థిస్తుందని విమర్శించారు. ఆ ఎద్దులు చెవులు, కొమ్ములు విరిగిపోయి, తోక ఎముకలు విరిగిపోయి, ముక్కుకు కట్టిన తాడు వల్ల విపరీతమైన బాధను అనుభవించి మరణించడం చాలా బాధాకరం అని వర్మ అన్నారు. అమాయకమైన జంతువులను హింసిస్తూ దానికి సంప్రదాయం అనే పేరును అడ్డు పెట్టుకుని తప్పించుకుంటున్నారని వర్మ చెప్పారు. జల్లికట్టును సమర్థిస్తున్న ప్రతి ఒక్కరిపైకి 100 ఎద్దులను వదిలి తరువాత వారి ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలి. జల్లికట్టు కోసం పోరాటం చేస్తున్నవారు అనాగరికులు. అందుకే జంతువులను హింసించడానికి హక్కు కోసం పోరాడుతున్నారు. అమాయక జంతువులను హింసించే జల్లికట్టు కరెక్ట్ అయితే అమాయక ప్రజలను హింసించే ఆల్ ఖైదా కూడా కరెక్టే అని వర్మ అన్నారు. రక్షణ లేని జంతువులను సంప్రదాయం పేరు చెప్పి హింసించడం టెర్రరిజం కంటే దారుణమని వర్మ అభిప్రాయపడ్డారు. జల్లికట్టు కోసం పోరాడుతున్న వారికి సాంప్రదాయానికి స్పెల్లింగ్ కూడా తెలియదు. వారంతా రక్తం మరిగిన మానవ రూపంలో ఉన్న రాబందులు. ఆ జంతువులకు ఓటు హక్కు ఉండి ఉంటె ఒక్క రాజకీయనాయకుడు కూడా జల్లికట్టును సమర్దించాడు అని వర్మ కుండ బద్దలుకొట్టాడు.