Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కొందరు ఆకలిని ఏమాత్రం తట్టుకోలేరు. మరికొందరు ఒకటి రెండు రోజులు తిండిలేక పోయినా ఉండగలరు. ఇంకొందరు.. చీటికిమాటికి నోట్లో ఏదో ఒకటి వేసుకుని నమలాల్సిందే. అయితే, ఏదేనీ ప్రయాణ సమయాల్లోనో లేక విహార యాత్రకు వెళ్లేటపుడు, క్రీడలు ఆడే సమయాల్లో ఆకలి ఎక్కువగా అవుతుంది. అలాంటపుడు ఇన్‌స్టాంట్ ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్‌ను తీసుకోవడం ఉత్తమం. తక్షణం శక్తినివ్వడంతో పాటు గమ్యస్థానం చేరుకున్న తర్వాత కడుపునిండా ఆరగించేందుకు వీలుపడుతుంది. అలా తక్షణం శక్తినిచ్చే ఆహార పదార్థాలేంటో ఓసారి తెలుసుకుందాం

* పాలు… ఎనర్జీ లెవెల్స్‌ను ఒక్కసారిగా పెంచుతాయి.
* అరటి పండ్లు… శరీరానికి కావాల్సిన శక్తిని వేగవంతంగా అందిస్తాయి.
* బీన్స్… అలసటను దరిచేరనీయవు.
* ఆకు కూరలు… డిప్రెషన్‌కు గురికాకుండా చేస్తాయి.
* గుడ్లు… రోజంతటికీ కావాల్సిన శక్తిని అందిస్తాయి.
* పెరుగు… ఎనర్జీ లెవెల్స్‌ను పెంచుతుంది.
* గుమ్మడి గింజలు… కండర శక్తికి బాగా సహాయపడుతాయి.