Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

జిడ్డు చర్మానికి… వేసవి కష్టకాలం. ఎండ తీవ్రతకు చర్మంలోని నూనె గ్రంథులు మరింతగా స్రవిస్తాయి. ఆ జిడ్డు మీద దుమ్మూధూళి, కాలుష్య రేణువులు చేరినప్పుడు చర్మం ఇరిటేషన్‌కు గురవుతుంది. గుల్లలు, మచ్చలు వస్తాయి. ఈ కష్టాలను తప్పించడానికి ఇంట్లోనే చేసుకోగలిగిన బ్యూటీ ట్రీట్‌మెంట్‌లు కొన్ని.

టొమాటో ప్యాక్‌…
టొమాటోను చిదిమి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడిగితే ముఖం మీద ఉన్న జిడ్డు పోయి రోజంతా తాజాగా ఉంటుంది. వంట కోసం వాడేటప్పుడు చిన్న ముక్కను తీసుకుని ముఖానికి రుద్దుకోవచ్చు. కొంతమందికి టొమాటో సరిపడదు, స్కిన్‌కు ఇరిటేషన్‌ వస్తుంటుంది. అలాంటప్పుడు ఒకటి – రెండు ద్రాక్ష పండ్లను స్కిన్‌ తొలగించి గుజ్జును చిదిమి ముఖానికి రాసుకోవచ్చు.

హనీ–కార్న్‌ మాస్క్‌…
ఒక పచ్చిబంగాళదుంప, ఒక టేబుల్‌స్పూను కార్న్‌ఫ్లోర్, ఒక టేబుల్‌ స్పూను తేనె తీసుకోవాలి. బంగాళదుంపను తురిమి రసం తీసుకోవాలి. ఆ రసానికి తేనె, కార్న్‌ఫ్లోర్‌ కలిపి ముఖానికి, మెడకు, చేతులకు ప్యాక్‌ వేయాలి. ఇది ఆరే కొద్దీ స్కిన్‌ను టైట్‌ చేస్తుంది. పదిహేను నిమిషాల తర్వాత ప్యాక్‌ను కడిగేయాలి. కడిగిన వెంటనే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆయిలీ స్కిన్‌కు మాత్రమే. సెన్సిటివ్‌ చర్మానికి, పొడి చర్మానికి ఈ ప్యాక్‌ వేస్తే మరీ పొడిబారే అవకాశముంది. కాబట్టి ఈ రెండు రకాల చర్మానికి కార్న్‌ఫ్లోర్‌ను మినహాయించి ప్యాక్‌ వేసుకోవచ్చు.