Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కావల్సినవి: చిక్కుడు కాయ – పావు కేజీ, బెల్లం లేదా పంచదార – 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి), పచ్చి మిర్చి – 1 (సన్నగా తరగాలి), వెల్లుల్లి రెబ్బలు – 8 (కచ్చాపచ్చాగా దంచాలి), కరివేపాకు – 2 రెమ్మలు, జీలకర్ర – టీ స్పూన్, మినప్పప్పు – టీ స్పూన్, కారం – టీ స్పూన్, ధనియాల పొడి – టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత
తయారీ: చిక్కుడుకాయలను శుభ్రం చేసి, ముక్కలు చేయాలి. గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోసి, చిక్కుడుకాయలను ఉడికించి దించాలి.బాణలిలో 2 టేబుల్‌స్పూన్ల నూనె వేసి, వేడయ్యాక జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేయించాలి. దీంట్లో ఉల్లిపాయలు వేసి వేగాక, కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, బెల్లం లేదా పంచదార వేసి కలపాలి. ఉడికిం చిన చిక్కుళ్ళు వేసి కలిపి, 10 నిమిషాల సేపు ఉంచి, కొత్తిమీర చల్లి దించాలి.