Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కావల్సినవి: చిక్కుడు గింజలు – పావు కేజీ, బాస్మతి బియ్యం – 2 కప్పులు, నూనె – 3 టేబుల్ స్పూన్లు, యాలకులు – 6, లవంగాలు – 4, సాజీరా – అర టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 3, దాల్చిన చెక్క – చిన్న ముక్క, పుదీనా ఆకులు – కప్పు, మెంతి ఆకులు – అర కప్పు , ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్, పచ్చి మిర్చి – 6 (సన్నగా చీల్చాలి), నీళ్లు – 4 కప్పులు, కొత్తిమీర – అలంకరణకు తగినంత

తయారీ:  చిక్కుడు గింజలలో నీళ్లు పోసి, ఉడికించి, వార్చి పక్కనుంచాలి. (చిక్కుళ్లు పై పొర వచ్చేలా ఉడికించాలి.)  బియ్యం కడిగి, నీళ్లు పోసి అరగంటపాటు నాననివ్వాలి.  మసాలా దినుసులు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి – అన్నీ కట్ చేసి సిద్ధంగా ఉంచాలి.  పొయ్యి మీద గిన్నె పెట్టి, నూనె పోసి వేడి చేయాలి. దీంట్లో సాజీర, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. దీంట్లో పుదీనా, మెంతి ఆకులు వేసి కలపాలి.   ఉల్లిపాయలు వేసి బాగా వేగాక అల్లం – వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి వేసి కలపాలి.  దీంట్లో ఉడికించిన బీన్స్ వేయాలి. ఉప్పు, నానబెట్టిన బియ్యం వేసి ఉడికించాలి. నీళ్లనీ పూర్తిగా ఇంకిపోయి అన్నం ఉడికాక మంట తగ్గించాలి. మరో 5 నిమిషాలు ఉడికించి, చివరగా కొత్తిమీర చల్లి దించాలి. దీనిని ఏదైనా నచ్చిన గ్రేవీతో లేదా రైతాతో వడ్డించాలి.