Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అమెరికాలోని చికాగోలో సెప్టెంబర్ 16న ఓక్ బ్రూక్ లైబ్రరీలో ‘సాహితీ మిత్రుల’ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముత్తేవి రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాహితీమిత్రులు సమావేశాన్ని డాక్టర్ ఆరికెపుడి బాపు స్వాగతోపన్యాసంతో ప్రారంభమైంది. ప్రముఖ చిత్రకారుడు పద్మశ్రీ ఎస్‌వీ రామారావు సాహితీమిత్రుల సంస్థ సాహితీ సేవను కొనియాడుతూ ముఖ్య అతిథి ముత్తేవి రవీంద్రనాథ్‌ను సభకు పరిచయం చేశారు. అనేక రంగాల్లొ రవీంద్రనాథ్ రచనా ప్రతిభను వివరించారు. తెనాలి వాస్తవ్యుడు అయిన రవీంద్రనాథ్ వివరాలతోపాటు తెనాలి పట్టణ గొప్పతనాన్ని అక్కడి నుంచి వచ్చిన రచయితల గురించి వివరించారు.

వక్త ముఖ్య అతిథి రవీంద్రనాథ్ తన ప్రసంగంలో తెలుగువారి సంస్కృతి, ఆచారాల గురించి వివరించారు. వివిధ గ్రంథాల్లోని పద్యాలను తీసుకొని తెలుగువారి ఆహరపు అలవాట్లు ప్రాచీన కాలంలో ఏవిధంగా ఉండేవో వివరించారు. శ్రీనాథుని, ధూర్జఠి గ్రంథాల్లో ఉన్న తెలుగువారి ఆచార వ్యవహారాలను, ఆహరపదార్థాల ఆరోగ్య విలువలను విపులీకరించారు. రెండు గంటలకు పైగా సాగిన ప్రసంగం శ్రోతలకు ఆనందాన్ని కలిగించింది. ‘చికాగో సాహితీ మిత్రులు’ అధ్యక్షులు చింతం సుబ్బారెడ్డి సభికులకు ధన్యవాదాలు తెలిపారు.