Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

క్రికెట్ కు వీడ్కోలు పలికిన తరువాత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో పంచ్ లు విసురుతున్నారు. వీరూ నోటి నుంచి వచ్చిన చిన్న మాటైనా పెద్ద జోకులా పేలి నవ్వుల జల్లులు కురిపిస్తోంది. సోహాల్ మీడియా వేదికగా ట్వీట్లతో నెటిజన్లకు ఆనందం పంచుతున్న సెహ్వాగ్ కామెంటేటర్ గా కూడా మెరిశాడు. గురువారం జరిగిన భారత, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ కు వీరు కాసేపు కామెంట్రీ చెప్పాడు.

ధోని మెరుపు ఇన్నింగ్స్ ని సెహ్వాగ్ తనదైన శైలిలో అభివర్ణించాడు. ధోని అర్థ శతకం పూర్తి చేసాక వీరూ అన్న మాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడు మహేంద్ర సింగ్ ధోని కాదు.. మహేంద్ర బాహుబలి అని సెహ్వాగ్ అన్నాడు. దీని ద్వారా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మానియా, ధోని సత్తా రెండూ ఒకేసారి ప్రపంచానికి తెలిసాయి. భారత జట్టు ఈ మ్యాచ్ లో ఓడినప్పటికీ ధోని తన బ్యాట్ ఝుళిపించాడు. 7 ఫోర్లు , 2 సిక్సులతో 52 బంతుల్లో 63 పరుగులు చేశాడు.

కాగా ఈ మ్యాచ్ లో భారత్ ఓటమి చెందడంతో సెమీస్ చేరాలంటే తరువాతి మ్యాచ్ లో తప్పనిసరిగా గెలుపొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదివారం టీం ఇండియా, బలమైన సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య డూ ఆర్ డై మ్యాచ్ జరగనుంది.