Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కిటికీలు మూసి వుంచుతున్నారా? ఎప్పుడు ప్రధాన ద్వారాలను మూసేస్తున్నారా? అయితే ఇకపై అలా చేయకండి. రాత్రిపూట మినహా పగలంతా ఇంటిలోపలికి వెలుతురును ప్రసరింపజేసే, కిటికీలు, ద్వారాలను తెరిచే వుంచాలంటున్నారు.. ఫెంగ్‌షుయ్ నిపుణులు. కిటికీలను, తలుపులను ఎప్పుడూ మూసివుంచడం ద్వారా చి ప్రవాహం, సానుకూల శక్తులు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయి. కిటికీలు కూడా అంతే. ఇంకా ఇంట్లో గాలిని శుద్ధీకరించే మొక్కలను వుంచుకోవాలి. ఇవి గాలిని శుభ్రపరచడంతో పాటు ఇంట్లోకి  పాజిటివ్ శక్తులను ఆహ్వానిస్తాయి.
అలాగే ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో వున్న వారు మనస్సును ఆహ్లాదకరంగా ఉంచుకోవాలి. ఎప్పుడూ చిరాకు, కోపంతో ఉండకూడదు. పడకగది, బాత్రూమ్, కిచెన్ ఎప్పుడూ శుభ్రంగా వుంచుకోవాలి. ఈ మూడింటిని శుభ్రంగా వుంచుకోవడం ద్వారా కొత్త ఎనర్జీ లభిస్తుంది. తద్వారా ఆ ఇంట ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం కూడా చేరుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.