Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేశీయ ఐటీ సర్వీసుల దిగ్గజం విప్రోకు రెండోసారి బెదిరింపు లేఖ వచ్చింది. రెండోసారి కూడా కంపెనీకి బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో, విప్రో అలర్ట్ అయింది. తన అన్ని కార్యాలయ ప్రాంగణాలన్నింటిల్లోనూ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. ఇప్పటికే ఓసారి 500 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకుండా విప్రో క్యాంపస్ లోకి విషపూరిత గ్యాస్ ను పంపిస్తామని బెదిరిస్తూ బెంగళూరులోని కార్యాలయానికి ఓ ఈ-మెయిల్ వచ్చింది. రెండోసారి కూడా కంపెనీని బెదిరిస్తూ గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్ పంపినట్టు విప్రో ధృవీకరించింది.
అయితే  ఇది కంపెనీ ఆపరేషన్స్ లో ఎలాంటి ప్రభావం చూపదని కంపెనీ  ఓ ప్రకటనలో పేర్కొంది. ఈసారి రూ.500 కోట్ల బిట్ కాయిన్లను ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఇవ్వకపోతే ఉద్యోగులపై బయో అటాక్ జరుపుతామని బెదిరిస్తున్నారని అదనపు పోలీసు కమిషనల్ హేమంత్ నింబాల్కర్ చెప్పారు. విప్రోకు బెదిరింపు లేఖ రావడం ఇది రెండోసారని, గుర్తుతెలియని వ్యక్తులు రూ.500 కోట్ల బిట్ కాయిన్లను డిమాండ్ చేస్తున్నారని, లేకుండా బయో అటాక్ జరుపుతామని హెచ్చరిస్తున్నట్టు చెప్పారు. మొదటిసారి బెదిరింపు లేఖ రావడంతోనే కంపెనీ లోకల్ లా ఎన్ ఫోర్స్ మెంట్ అథారిటీల దగ్గర ఫిర్యాదును దాఖలు చేసింది.